• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఉప్పు తగ్గించినా బీపీ తగ్గట్లేదా? కార్డియాలజిస్ట్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

ఉప్పు తగ్గించినా బీపీ తగ్గట్లేదా? కార్డియాలజిస్ట్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

చాలామంది హై బీపీ సమస్యతో బాధపడుతుంటారు, అయితే కేవలం ఉప్పు తగ్గించడం వల్ల మాత్రమే ఇది తగ్గుతుందని అనుకుంటారు. కానీ, కేవలం ఉప్పు తగ్గించినంత మాత్రాన హై బీపీ సమస్య పూర్తిగా తగ్గదు. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు వాడటం తప్పనిసరి. అదే సమయంలో వైద్యులు సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను అదుపు చేయవచ్చు.

Written ByRenuka Godugu
Published: Sep 25, 2026, 09:14 AM IST|Updated: Sep 25, 2026, 09:16 AM IST
joinshare
ఉప్పు తగ్గించినా బీపీ తగ్గట్లేదా? కార్డియాలజిస్ట్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
Image Credit: High BP

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

High BP Control Tips: ప్రస్తుత కాలంలో చాలామంది బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, రక్తపోటు సమస్య ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అంతేకాకుండా, ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత నిద్ర పోవాలి. క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ చిన్న మార్పులు పాటిస్తే బీపీ సమస్య పెరగకుండా ఉంటుంది.

ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి..
సోడియం తీసుకోవడాన్ని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్యాక్ చేసిన, అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లను మాత్రమే తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసం, రెడీమేడ్ సాసుల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది, ఇది బీపీని పెంచుతుంది.

బ్లడ్ ప్రెషర్ ఫ్రెండ్లీ ఆహారం..
బీపీని అదుపులో ఉంచే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్వీట్ పొటాటో, కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

మెగ్నీషియం అవసరం..
బీపీ సమస్య ఉన్నవారు మెగ్నీషియం ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. విత్తనాలు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, పప్పు ధాన్యాలను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.

నడక తప్పనిసరి..
నేటి కాలంలో చాలామంది తమ పనుల వల్ల ఎక్కువ సమయం కూర్చుని గడపాల్సి వస్తోంది. కాబట్టి ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవాలి. వైద్య నిపుణుల ప్రకారం, వారానికి కనీసం 150 నిమిషాల పాటు శారీరక శ్రమ అవసరం. రోజూ 30 నిమిషాల పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఒత్తిడి తగ్గించుకోండి.. నిద్రపోండి..
హై బీపీ ఉన్నవారు ప్రతిరోజూ కనీసం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలి. ఇది శరీరానికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. కావాలంటే యోగా కూడా చేయవచ్చు. సరైన నిద్ర, తక్కువ ఒత్తిడి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health