• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /నాన్-స్టిక్ కోటింగ్ పాడవకుండా ప్యాన్ అంచుల జిడ్డును వదిలించే సీక్రెట్ ట్రిక్!

నాన్-స్టిక్ కోటింగ్ పాడవకుండా ప్యాన్ అంచుల జిడ్డును వదిలించే సీక్రెట్ ట్రిక్!

నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ రెగ్యులర్‌గా ఇంట్లో వాడుతూ ఉంటాం. దీనిపై రిసిపీలు స్టిక్‌ అవ్వకుండా ఉంటాయి. సాధారణంగా మనం రిసిపీలు తయారు చేసినప్పుడు వాటి అంచులకు జిడ్డు ఎంత శుభ్రం చేసినా అలాగే పట్టేస్తుంది. త్వరగా వదలకుండా పోతుంది. ఎక్కువగా ఆయిల్‌ వాడుతూ ఉంటాం కాబట్టి వాటి ఆనవాళ్లు అలాగే ఉండిపోయి రానురాను గట్టిగా పట్టేసుకుంటుంది. అయితే, నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ బలంగా రుద్ది కడగలేం. చూడటానికి ఇది డల్‌గా మారిపోతుంది. అయితే, నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ సులభంగా జిడ్డు వదిలిపోవడం చాలా ఈజీ.

Written ByRenuka Godugu
Published: Sep 16, 2026, 03:51 PM IST|Updated: Sep 16, 2026, 03:57 PM IST
joinshare
నాన్-స్టిక్ కోటింగ్ పాడవకుండా ప్యాన్ అంచుల జిడ్డును వదిలించే సీక్రెట్ ట్రిక్!
Image Credit: Non-Stick Pan Stubborn Grease

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Non-Stick Pan Stubborn Grease: నాన్‌ స్టిక్‌ పాత్రలు కడిగేటప్పుడు ఇతర పాత్రల మాదిరి గట్టిగా రుద్ది కడగకూడదు. ఎందుకంటే నాన్‌ స్టిక్‌ కోటింగ్‌ పాడవుతుంది. ఇందులో ఎక్కువగా ఆయిల్‌ ఫుడ్‌ వండుతాం. నిత్యం దోశ, చపాతీలు వేసుకుంటాం.. కాబట్టి గట్టిగా పట్టేస్తుంది. ఇంట్లోని చిన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా నాన్‌ స్టిక్‌ కోటింగ్‌ వదలకుండానే ఈజీగా జిడ్డును వదిలించేయవచ్చు. మీ వద్ద స్ట్రాంగ్‌ క్లెన్సర్‌, ఒక స్క్రబ్బర్‌ ఉంటే సరిపోతుంది. చిన్నపాటి స్టెప్స్‌తో మీరు నాన్‌ స్టిక్‌ పాడవకుండానే జిడ్డును వదిలించేయవచ్చు.

సోప్‌ వాటన్‌, వేడినీళ్లు..
ముందుగా బాగా జిడ్డుపట్టి ఉన్న నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ తీసుకోండి. అందులో గోరువెచ్చని నీరు నిండుగా పోయండి. ఇందులోనే కొన్ని చుక్కల మైల్డ్‌ డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ కూడా పోయాలి. ఇప్పుడు మృదువైన స్పాంజ్‌ లేదా గుడ్డ తీసుకుని తుడవండి. ప్రధానంగా జిడ్డుగా మారిపోయిన నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ అంచులను రాయండి. కాసేపు ఓ 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు అంటుకున్న జిడ్డు ఊడి వస్తుంది. దీంతో మీరు శుభ్రం చేయడం సులభం అవుతుంది.

బేకింగ్‌ సోడా వాడండి..
ఇప్పటికీ గ్రీజ్‌ అలాగే ఉంటే బేకింగ్‌ సోడాతో పేస్ట్‌ తయారు చేయండి. కేవలం జిడ్డు ఎక్కువగా పట్టిన ప్రాంతంలో అప్లై చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు మృదువైన స్పాంజ్‌ తీసుకొని రబ్‌ చేయాలి. గట్టిగా స్క్రబ్‌ చేయడం వల్ల కోటింగ్‌ ఊడిపోయే ప్రమాదం ఉంది.

వైట్‌ వెనిగర్‌..
వైట్‌ వెనిగర్‌ కూడా జిడ్డును త్వరగా వదిలించేస్తుంది. వెనిగర్‌, నీటిని సమపాళ్లలో తీసుకోండి. ఇప్పుడు మృదువైన గుడ్డను తీసుకుని ప్యాన్‌ అంచులు రుద్దండి. అయితే, వెనిగర్‌ పెట్టి ఎక్కువ సమయంపాటు ప్యాన్‌ అలాగే ఉంచకూడదు. వెంటనే డిష్‌ వాష్‌ సోప్‌ లేదా లిక్విడ్‌తో రుద్దండి.

Also Read: హోల్ మిల్క్ vs స్కిమ్డ్ మిల్క్.. గుండె ఆరోగ్యానికి ఏ పాలు బెస్ట్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

Also Read: తెల్ల జుట్టు, గ్యాస్ ప్రాబ్లమ్‌కి కరివేపాకుతో చెక్.. రోజూ ఇలా తీసుకోండి!
 

స్టీల్‌, గట్టి స్క్రబ్బర్‌ వాడకండి..
స్టీల్‌ స్ర్కబ్బర్‌ వాడితే త్వరగా జిడ్డు వదిలిపోతుందిలే అనుకుంటారు. కానీ, గ్రీజ్‌ అంత సులభంగా రాదు.. గట్టిగా రుద్దితే నాన్‌ స్టిక్‌ పైన స్క్రాచ్‌ పడే అవకాశం ఉంటుంది. మృదువైన స్పాంజ్‌, మైక్రోఫైబర్‌ గుడ్డను ఉపయోగించాలి.

ప్యాన్‌ ఆరబెట్టండి..
నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ నుంచి గ్రీజ్‌ వదిలిపోతే వెంటనే ఆరబెట్టండి. మంచి టవల్‌ ఉపయోగించి శుభ్రం చేయండి. ఎక్కడైనా ప్యాన్‌ అంచులు తడిగా ఉండే గుడ్డతో శుభ్రం చేయండి. వాడిన వెంటనే ప్యాన్‌ శుభ్రం చేస్తే అంచులు ఇలా గ్రీజ్‌గా మారిపోవు. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ ఇలా శుభ్రం చేస్తే ఎక్కువ రోజులపాటు బాగుంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies