SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అవిసె గింజలు తింటే శరీరంలో అద్భుతాలు..! రోజూ తింటే దీర్ఘాయుష్షు..!

అవిసె గింజలు చూడటానికి చిన్నగా ఉంటాయి, కానీ వీటిలో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి మన వంటగదిలోనే ఉంటాయి కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్ లేదా కొన్ని ఆహార పదార్థాలతో కలిపి సులభంగా తీసుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Nov 15, 2026, 20:31 IST | Updated: Nov 15, 2026, 20:33 IST
Image Credit: flaxseeds benefits daily
Join

Eating Flaxseeds Daily:  అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఇవి కొన్ని రకాల వ్యాధులు మన దరిచేరకుండా కాపాడతాయి, అందులో క్యాన్సర్ కూడా ఉండవచ్చు. ప్రతిరోజూ మన ఆహారంలో ఈ చిన్న గింజలను చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ప్రధానంగా అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలామంది వీటి గురించి తెలియక ఆహారంలో చేర్చుకోరు, కానీ వీటిలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సమతుల్య ఆహారంలో ఒక భాగం అవుతుంది, అలాగే పోషకాహారానికి మంచి ప్రత్యామ్నాయంగా కూడా చెప్పవచ్చు.

అవిసె గింజల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువగా కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు, బరువు కూడా అదుపులో ఉంటుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, విత్తనాలతో కలిపి మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గింజలను బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా స్నాక్స్ రూపంలో తీసుకోవడం మంచిది. నేరుగా పెరుగులో లేదా ఓట్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు.

అయితే, మీరు ఇప్పటికే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటుంటే, అవిసె గింజలను కొద్ది మొత్తంలో తీసుకుని సమతుల్యం చేసుకోవాలి. పరిమాణం ఎక్కువైతే కూడా ఇబ్బందే. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఉంటాయి, వీటిని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. వివిధ రకాల ఆహారాల్లో ఈ ఒమేగా-3 లభిస్తుంది; కొన్ని రకాల చేపలు, గింజలు, విత్తనాల్లో ఇది ఉంటుంది. చాలామంది శాకాహారులు చేపలు తినరు కాబట్టి, అవిసె గింజలను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. వీటిని స్మూతీ రూపంలో కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

Read Also: కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!
Read Also: బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా ఉంటుంది, కాబట్టి ఫైబర్, ఒమేగా-3తో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇది శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ప్రోటీన్ ఆహారంలో ఉండటం అవసరం. పాలు, పెరుగు, గింజలు, తృణధాన్యాల ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. అవిసె గింజలను పెరుగుతో కలిపి తీసుకుంటే కూడా ప్రోటీన్ అందుతుంది. అవిసె గింజల్లో లిగ్నన్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా మొక్కల ఆధారితమైనవి, ఒక రకమైన పాలీఫినాల్స్. అవిసె గింజల పొడిని పాన్‌కేక్‌లో వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు; సులభంగా వంటకాల్లో కలుపుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసుకుని పొడి రూపంలో ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవచ్చు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES