• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /నిమ్మకాయలు వాడిపోతున్నాయా? నీళ్లలో ఇలా పెడితే 2 నెలలు ఫ్రెష్‌గా ఉంటాయి!

నిమ్మకాయలు వాడిపోతున్నాయా? నీళ్లలో ఇలా పెడితే 2 నెలలు ఫ్రెష్‌గా ఉంటాయి!

నిమ్మకాయలు ప్రతి వంటగదిలో ఉండాల్సిందే. ఇందులో విటమిన్‌ సీ ఉంటుంది. దీంతో పులిహోర, నాన్‌ వెజ్‌లకు కూడా వాడతాం. కాబట్టి నిమ్మకాలు ఇంట్లో ఉండాల్సిందే. అయితే, ఎక్కువ రోజులపాటు నిమ్మకాయలు నిల్వ ఉండవు, వాడిపోతుంటాయి. దీంతో వాటిని పారేయకతప్పదు. అయితే, ఇలా చేస్తే నిమ్మకాయలు ఎక్కువ కాలంపాటు పాడవ్వవు.

Written ByRenuka Godugu
Published: Oct 01, 2026, 02:21 PM IST|Updated: Oct 01, 2026, 02:25 PM IST
joinshare
నిమ్మకాయలు వాడిపోతున్నాయా? నీళ్లలో ఇలా పెడితే 2 నెలలు ఫ్రెష్‌గా ఉంటాయి!
Image Credit: How to store lemons

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

నిమ్మకాయలు మార్కెట్‌లకు వెళ్లినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తాం. అయితే ఒక్కోసారి ఫ్రిజ్‌లో పెట్టినా కూడా నిమ్మకాయలు పాడవుతాయి. చాలా మంది నిమ్మకాయలు సరిగ్గా స్టోర్‌ చేయరు. దీంతో అవి కుళ్లిపోవడం లేదా వాడిపోవడం జరుగుతాయి. ఇంట్లో మీరు నిమ్మకాయలు స్టోర్‌ చేసే పద్ధతి మార్చుకుంటే అవి రెండు నెలలు కూడా పాడవ్వకుండా ఉంటాయి.

నిమ్మకాయలు మీరు కూడా ఎక్కువగా కొనుగోలు చేశారా? వాటిని నిల్వ చేయలేక పోతున్నారా? కొన్ని రోజులకే పారేయాల్సి వస్తుంది.

నిమ్మకాయలో సిట్రిక్‌ యాసిడ్‌ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడతాయి.

మీరు తినే వంటలో నిమ్మరసం పిండుకుంటే మంచి ట్యాంగీ రుచి కూడా డిష్‌కు ఇస్తుంది.

ఈ నిమ్మకాయలో విటమిన్‌ సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది

నిమ్మకాయలు స్టోర్‌ చేసే విధానం..
నిమ్మకాయలు సులభంగా నిల్వ చేసుకోవచ్చు. వాటిని ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో పెట్టాలి. అవి మునిగే వరకు నీళ్లను నింపండి. ఆ తర్వాత గాలి చొరబడకుండా మూత పెట్టండి. దీంతో నిమ్మకాయలు పాడవ్వకుండా ఉంటాయి.

నిమ్మకాయలు కడిగి నీటి చుక్క లేకుండా తుడవండి. ఆ తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్‌లో చుట్టండి. ఒక్కో నిమ్మకాయను ఒక్కో పేపర్‌లో చుట్టండి. వీటిని ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేయండి. దీనికి బదులు జిప్‌ లాక్‌ బ్యాగ్‌ను కూడా ఉపయోగించవచ్చు. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ కాలంపాటు తాజాగా ఉంటాయి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

నిమ్మకాయలను కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టండి. ఇప్పుడు పై నుంచి నూనె రుద్దండి. ఇంట్లో వాడే ఏ వంట నూనె అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటిని కంటైనర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చ. ఈ ఆయిల్‌ లేయర్‌ నిమ్మకాయను మాయిశ్చర్‌ కాకుండా చేస్తుంది. అవి ఎక్కువ కాలంపాటు పాడవ్వకుండా ఉంటాయి.

ఇలా నిమ్మకాయలు ఇంటికి తీసుకువచ్చి.. పాడయ్యాక పారేయకుండా.. ఎక్కువ కాలంపాటు నిల్వ చేసుకోవచ్చు. ఈసారి నిమ్మకాయలు తీసుకువస్తే ఇలా స్టోర్‌ చేయండి. మీకు కావాల్సినప్పుడు వెంటనే ఉపయోగించండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies