Liver Detox Telugu Tips: ఆధునిక జీవనశైలితో పాటు శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం, వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్న వయసులోనే కాలేయ (Liver) సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పడు అందరిలో ఫ్యాటీ లివర్ సమస్య రావడం సర్వసాధారణమైపోయింది. శరీరంలోని హానికరమైన టాక్సిన్లు, వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో లివర్ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం దెబ్బతినడం మొదలైతే.. అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే, ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేదు.. చాలామంది వేలకు వేలు ఖర్చు చేసి రకరకాల డీటాక్స్ సప్లిమెంట్లు వినియోగిస్తున్నారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే.. రోజూ వినియోగించే 3 సాధారణ పదార్థాలతోనే కాలేయాన్ని డీటాక్స్ చేసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాలేయాన్ని డీటాక్స్ చేసేవి ఇవే..
నిమ్మకాయ (Lemon):
ప్రతి ఇంట్లో నిమ్మకాయలు సహజంగా లభిస్తాయని మనందిరికీ తెలుసు.. అయితే, ఇందులో విటమిన్ cతో పాటు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు కూడా అద్భుతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
దీనిని ఎలా తీసుకుంటే మంచిది?:
ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం పిండుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లివర్‌ను డీటాక్స్ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి.. శరీర బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడతుంది..
జీలకర్ర (Cumin Seeds):
జీలకర్ర కేవలం వంటలకు అద్భుతమైన రుచి అందించడమే కాకుండా ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేసి.. డీటాక్సిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎలా ఉపయోగించాలి?:
ఈ జీలకర్రను వినియోగించాలనుకునేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ జీలకర్ర వేసి బాగా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి.. వడకట్టి గోరువెచ్చగా తీసుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటే మరిగిన జీలకర్రను నమిలి డైరెక్ట్ తినొచ్చు.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది.
సొరకాయ (Bottle Gourd)
చాలామంది సొరకాయను పెద్దగా తినేందుకు ఇష్టపడరు.. కానీ.. కాలేయానికి ఇది అమృతం లాంటిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సొరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటు పోషక గుణాలు డ్యామేజ్ అయిన కాలేయ కణాలను రిపేర్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.. అలాగే కాలేయంపై వచ్చే వాపును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
దీనిని ఇలా తీసుకోండి..:
ముందుగా సొరకాయను తీసుకుని.. ముక్కలుగా చేసి గ్రైండర్‌లో వేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్‌గా చేసుకోవాల్సి ఉంటుంది.. దీనిని వడకట్టి.. అందులో చిటికెడు నల్ల ఉప్పు కలిపి ఉదయం పూట తీసుకుంటే కాలేయానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..