మన భారతీయ వంటగదిలో ఎన్నో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉండాల్సిందే. ప్రతిరోజూ ఏదో ఒక చట్నీ, పచ్చడి లేదా పొడులు తయారు చేసుకుంటూ ఉంటాం, కాబట్టి వీటిని రుబ్బుకోవడానికి మిక్సీ లేదా వెట్ గ్రైండర్ ఉపయోగిస్తారు. ఇడ్లీ, దోశలు తినే వారు ప్రతిరోజూ లేదా రెండు రోజులకు ఒకసారి పిండి కూడా రుబ్బుకోవాల్సి ఉంటుంది. మిక్సీ గ్రైండర్ విషయానికి వస్తే, దీనికి రెండు మూడు జార్లు ఉంటాయి. షార్ప్ బ్లేడ్లు ఉంటాయి. రోజువారీ వంటకాలకు ఇది చాలా కీలకం. వెట్ గ్రైండర్‌లో రాతితో చేసిన పెద్ద డ్రమ్ ఉంటుంది. ఇందులో నానబెట్టిన దోశ, ఇడ్లీ లేదా పప్పులను రుబ్బుకోవచ్చు. ఈ రెండిటిలో ఏది పవర్ ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం.
మిక్సర్ గ్రైండర్..
ఒకవేళ మీ ఇంటి వంటగదికి మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేయాలనుకుంటే, మీ రోజువారీ పనులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు రెగ్యులర్‌గా మసాలాలు, చట్నీలు, కర్రీ పేస్టులు రుబ్బుకోవాలనుకుంటే మిక్సర్ గ్రైండర్ తీసుకోండి. ఒకవేళ పిండి రుబ్బాలంటే కొద్ది కొద్దిగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. మీ కిచెన్ కౌంటర్ చిన్నగా ఉన్నా కూడా మిక్సీ తీసుకోవచ్చు. మీకు బ్లెండర్, జ్యూసర్ రెండూ కావాలంటే మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేయండి.
వెట్ గ్రైండర్..
మీ ఇంట్లో రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, వడ, ఇడ్లీ వంటివి తప్పనిసరి అయితే, కచ్చితంగా వెట్ గ్రైండర్ ఉండాల్సిందే. రెగ్యులర్‌గా బ్యాటర్ తయారు చేయాలంటే వెట్ గ్రైండర్ కొనుగోలు చేయడం మంచిది. ఇందులో బ్యాటర్ చాలా స్మూత్‌గా వస్తుంది. గ్రైండింగ్ సులభంగా అవుతుంది. ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పిండి రుబ్బాలనుకుంటే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మీరు ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే.. మిక్సీ గ్రైండర్ అనేది ఒక ప్రాక్టికల్ ఛాయిస్. ఇది రోజువారీ పనులకు ఎంత ఉపయోగపడుతుంది. వెట్ గ్రైండర్ కేవలం బ్యాటర్ కోసం మాత్రమే కీలకం. దానిని అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. కిచెన్ కౌంటర్ చిన్నగా ఉంటే, రోజువారీ పనుల కోసం మిక్సీ తీసుకోవడం బెట్టర్. దీని రేటు తక్కువగా ఉంటుంది. వివిధ ధరలలో అందుబాటులో ఉంటుంది. దీనితో మీరు చిన్న మొత్తంలో పిండిని కూడా రుబ్బుకోవచ్చు.
మిక్సర్ గ్రైండర్ హై-స్పీడ్ ఎలక్ట్రానిక్ మోటార్, షార్ప్ బ్లేడ్లను కలిగి ఉంటుంది. దీనివల్ల త్వరగా గ్రైండ్ అయిపోతుంది. చట్నీలు, కర్రీ పేస్టులు సులభంగా రుబ్బుకోవచ్చు. కొన్ని గ్రైండర్లతో పాటు జ్యూస్ మేకర్ కూడా వస్తుంది. తద్వారా మీరు జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. వేయించిన మసాలాలు, చట్నీలు, ఉల్లిపాయ-టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టులను కూడా ఇందులో రుబ్బుకోవచ్చు.
ఇక వెట్ గ్రైండర్ విషయానికి వస్తే, ఇది త్వరగా పేస్ట్ చేయకపోవచ్చు కానీ ఇందులో మెటల్ బ్లేడ్స్ ఉంటాయి. పెద్ద డ్రమ్ ఉండటం వల్ల నానబెట్టిన పప్పులు, బియ్యాన్ని రుబ్బుకోవచ్చు. ఇది ప్రాసెస్ కొంచెం నెమ్మదిగా చేసినా, మన పూర్వీకుల పద్ధతిలో పిండిని రుబ్బుతుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో పిండిని ఒకేసారి రుబ్బుకోవచ్చు.