• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఉదయం నిద్రలేవగానే గుండె దడ, తెలియని భయం వేధిస్తున్నాయా? మార్నింగ్ యాంగ్జయిటీకి చిట్కాలు..

ఉదయం నిద్రలేవగానే గుండె దడ, తెలియని భయం వేధిస్తున్నాయా? మార్నింగ్ యాంగ్జయిటీకి చిట్కాలు..

Morning Anxiety: ఉదయం లేవగానే చాలామందిలో ఆందోళన వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి ఎలా పరిష్కారం పొందాలో ఇప్పుడు తెలుసుకోండి..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 10:46 IST|Updated: Nov 22, 2026, 10:47 IST
joinshare
ఉదయం నిద్రలేవగానే గుండె దడ, తెలియని భయం వేధిస్తున్నాయా? మార్నింగ్ యాంగ్జయిటీకి చిట్కాలు..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Morning Anxiety Telugu: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మార్నింగ్ యాంగ్జయిటీ ఒకటి.. రాత్రంతా నిద్రపోయిన తర్వాత. ఉదయం కళ్ళు తెరవగానే ప్రశాంతంగా ఉండాల్సిన మనసు.. ఒక్కసారి తెలియని భయంతో.. ఆందోళనతో.. గుండె దడతో బరువెక్కిపోతోంది.. రోజు ప్రారంభంలోనే ఇలాంటి అసౌకర్యాలు కలగడం వల్ల రోజంతా పనులపై ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే దీనికి శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణమని ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు..

సాధారణంగా మనం ఉదయం నిద్ర లేచిన మొదటి 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్స్ స్థాయిలు సహజంగానే విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దీనిని వైద్య పరిభాషలో కార్టిసాల్ అవేకనింగ్ రెస్పాన్స్ గా పిలుస్తూ ఉంటారు.. మనం నిద్ర మత్తు వదిలి రోజంతా ఉత్సాహంగా.. చురుగ్గా పనిచేయడానికి కావాల్సినంత శక్తి అందించడానికి ఈ ప్రక్రియ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే తీవ్రమైన ఒత్తిడితో పాటు సరైన నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార పలవాట్ల కారణంగా సహజ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా కార్టిసాల్ హార్మోన్ అదుపుతప్పి అవసరానికి మించి విడుదల కావడంతో.. నిద్ర లేవగానే తీవ్రమైన ఆందోళనతో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, కంగారు వంటి సమస్యలు వస్తూ ఉన్నాయని నిపుణులు తెలుపుతూ ఉన్నారు..

కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తిరిగి సమతుల్యం చేసుకోవడానికి ఉదయాన్నే ఆందోళన తగ్గించుకోవడానికి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. మంచి ఫలితాలు పొందగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. నిద్రలేచిన వెంటనే కనీసం 10 నిమిషాలు లేత ఎండలో గడపడం చాలా మంచిదట. సూర్యకాంతి శరీరంలోని జీవ గడియారాన్ని సరిచేసి.. హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఉదయం లేవగానే పరిగడుపున కాఫీ టీలు తాగకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అందులో లభించే కెఫిన్ పదార్థం కార్టిసాల్ స్థాయిలను మరింత పెంచి ఆందోళనను విపరీతంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ప్రతిరోజు ఉదయం కొంత సమయం పాటు తప్పకుండా యోగా చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. తేలికపాటి వ్యాయామాలతో పాటు శ్వాస వ్యాయామాలు నాడీ వ్యవస్థను శాంతి పరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీని కారణంగా ప్రశాంతత కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సరైన సమయానికి నిద్రపోవడమే కాకుండా పోషకాహారం తీసుకోవడం వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆందోళన వంటి ఇబ్బందులు పడేవారు తప్పకుండా ఇవి పాటించాల్సి ఉంటుంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Health