SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

లెక్కల్లో ఫస్ట్ రావాలంటే నిజంగానే బెండకాయ తినాలా? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో తెలుసా?

Okra Benefits: చిన్నతనం నుంచీ పిల్లలు బెండకాయలు తింటే గణితంలో చురుగ్గా మారతారని.. లెక్కలు సులువుగా చేయగలరని పెద్దలు చెబుతుండటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ నమ్మకంతోనే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆహారంలో బెండకాయ కూరను తరచూ చేర్చడానికి ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 13:27 IST | Updated: Nov 17, 2026, 13:29 IST
Image Credit: Okra Benefits:
Join

Okra Benefits: చిన్నతనం నుంచీ పిల్లలు బెండకాయలు తింటే గణితంలో చురుగ్గా మారతారని.. లెక్కలు సులువుగా చేయగలరని పెద్దలు చెబుతుండటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ నమ్మకంతోనే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆహారంలో బెండకాయ కూరను తరచూ చేర్చడానికి ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు. అయితే.. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కేవలం బెండకాయలు తినడం వల్ల నేరుగా గణిత నైపుణ్యాలు మెరుగుపడతాయనడానికి గానీ.. మేధస్సు పెరుగుతుందనడానికి గానీ ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. పిల్లల్లో ఆరోగ్యకరమైన కూరగాయలు తినే అలవాటును పెంపొందించేందుకు పెద్దలు చెప్పే ఒక సాంప్రదాయ నమ్మకం మాత్రమే ఇది.

బెండకాయ రుచికరమైనది మాత్రమే కాదు, చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఇది శరీరానికి విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. సుమారు 100 గ్రాముల బెండకాయలో 33 కేలరీలు, 3.2 గ్రాముల ఫైబర్, 23 మిల్లీగ్రాముల విటమిన్ సి, 60 మైక్రోగ్రాముల ఫోలేట్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీర కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

బెండకాయల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్  పుష్కలంగా లభిస్తాయి. దీంతో ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని పరిశోధనల్లో బెండకాయల్లోని పోషకాలు నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించే లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రచురితమైన పలు పరిశోధన సమీక్షలు బెండకాయలోని బయోయాక్టివ్ సమ్మేళనాల ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడించాయి. అయితే మానవులపై వీటి ప్రత్యక్ష ప్రభావం గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉంది.

మెదడు సరైన అభివృద్ధికి సమతుల్య ఆహారం చాలా అవసరం. బెండకాయలో లభించే ఫోలేట్,  విటమిన్ బి6 వంటి పోషకాలు శారీరక విధులకు సహాయపడతాయి. అయితే, కేవలం బెండకాయ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని లేదా పిల్లలు చదువులో మొదటి పది స్థానాల్లో నిలుస్తారని కచ్చితంగా చెప్పలేం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం, పిల్లలకు ఆకుకూరలు, పండ్లు, పప్పులు,  నట్స్ వంటి వారికి అవసరమైన అన్ని పోషకాలు ఉండే సంపూర్ణ ఆహారాన్ని అందించడం ఉత్తమం.

బెండకాయలో అధికంగా ఉండే పీచుపదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు ఎక్కువసేపు నిండినట్లుగా ఉంచుతుంది. అంతేకాకుండా, బెండకాయలోని పీచుపదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఆఫీసులు ఖాళీ.. బడులకు తాళాలు.. సామూహిక సెలవులో లక్షన్నర మంది ఉద్యోగులు..!!

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES