SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎప్పుడూ నిజాలే కాదు, పిల్లల ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఈ 5 అబద్ధాలు కూడా చెప్పాల్సిందే!

Positive Parenting: పిల్లలు అబద్ధాలు చెబితే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది. ఎందుకంటే "అబద్ధం ఆడకూడదు", "ఎప్పుడూ నిజమే చెప్పాలి" అనే మంచి విలువలను చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించడం మన సంస్కృతిలో భాగం.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 15:08 IST | Updated: Nov 17, 2026, 15:10 IST
Image Credit: Positive Parenting:
Join

Positive Parenting: పిల్లలు అబద్ధాలు చెబితే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది. ఎందుకంటే "అబద్ధం ఆడకూడదు", "ఎప్పుడూ నిజమే చెప్పాలి" అనే మంచి విలువలను చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించడం మన సంస్కృతిలో భాగం. అయితే, నేటి డిజిటల్ కాలంలో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడటం కొన్నిసార్లు పిల్లలను ప్రమాదపు అంచున నిలబెట్టవచ్చు.  అత్యవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను, రక్షణను కాపాడుకోవడానికి పిల్లలు కొన్నిసార్లు చెప్పే చిన్న అబద్ధాలు వారికి రక్షణ కవచంలా నిలుస్తాయి. అలాంటి సందర్భాల్లో పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు ముందే నేర్పించాల్సిన ఆ ఐదు ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఆన్‌లైన్ వేదికల్లో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచడం
నేటికాలంలో చిన్నారులు కూడా స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఎవరైనా వారి స్కూలు పేరు, ఇల్లు ఉన్న ప్రాంతం, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలు అడిగితే ఎలాంటి పరిస్థితుల్లోనూ నిజాలు చెప్పకూడదని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. గేమింగ్ చాట్‌లలో సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయితే తప్పుడు వివరాలు ఇవ్వడం లేదా ఆ యూజర్‌ను వెంటనే బ్లాక్ చేసి ఆ విషయాన్ని పేరెంట్స్‌కు తెలపడం ఉత్తమ మార్గమని నేర్పించాలి.

2. అపరిచితుల ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇవ్వడం
బయట వ్యక్తులు ఎవరో తెలియని వారు వచ్చి "మీ ఇల్లు ఎక్కడ?", "నాన్న ఫోన్ నంబర్ ఎంత?" అని ఆరా తీస్తే చిన్నారులు భయపడకుండా సమయస్పూర్తితో వ్యవహరించాలి. "నాకు ఆ విషయాలు గుర్తులేవు" లేదా "నా దగ్గర ఫోన్ నంబర్ లేదు" అంటూ అక్కడి నుంచి తప్పించుకోవడం నేరపడదు; అది వారి ప్రాణ రక్షణ కోసం చెప్పే మంచి అబద్ధమేనని వారికి అర్థం చేయించాలి.

3. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భద్రతా జాగ్రత్తలు
కొన్నిసార్లు పిల్లలు కాసేపు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎవరైనా కొత్తవారు తలుపు తట్టినా లేదా కాలింగ్ బెల్ మోగించినా భయపడిపోయి "నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను" అని నిజం చెప్పకూడదు. "నాన్న బాత్రూంలో ఉన్నారు, ఇప్పుడే తలుపు తీయవద్దన్నారు" లేదా "అమ్మ నిద్రపోతున్నారు, కాసేపాగి రండి" అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనే నమ్మకం కలిగేలా లోపలి నుంచే మాట్లాడాలని నేర్పించాలి.

4. అభద్రతా భావం కలిగినప్పుడు మర్యాద పక్కన పెట్టడం
పార్కుల్లో, బస్టాప్‌లలో లేదా లిఫ్ట్‌లలో ఎవరి ప్రవర్తనైనా విచిత్రంగా అనిపించినా, భయపెట్టేలా ఉన్నా పిల్లలు మర్యాద గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. "మా నాన్న కారులో ఇక్కడే పక్కన ఉన్నారు", "అమ్మానాన్న ఇప్పుడే వస్తున్నారు" అని ధైర్యంగా చెప్పి వెంటనే రద్దీగా ఉండే ప్రాంతానికి లేదా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి పరుగులు తీయాలని వారికి శిక్షణ ఇవ్వాలి.

5. కుటుంబ ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం
చుట్టాల్లో లేదా బయటి వ్యక్తులు సరదాగా మాట్లాడేలా కబుర్లు కలిపి "మీ ఇంట్లో ఎంత డబ్బుంది?", "కొత్త నగలు ఏమైనా కొన్నారా?" అని ఆరా తీస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు పిల్లలు "మాకు అలాంటి విషయాలు ఏవీ తెలియవు", "అమ్మానాన్న మాతో ఆ సంగతులు చెప్పరు" అని సూటిగా చెప్పేయాలని నేర్పించాలి.

పిల్లల భద్రతను కాపాడే మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు:
సీక్రెట్ సేఫ్ కోడ్: మీ పిల్లలతో ఒక రహస్య పదాన్ని (కోడ్‌వర్డ్) ముందే నిర్ణయించుకోండి. స్కూల్ వద్దకు ఎవరైనా వచ్చి "మీ అమ్మకు యాక్సిడెంట్ అయింది, నన్ను తీసుకెళ్లమన్నారు" అని చెబితే, పిల్లలు ఆ కోడ్‌వర్డ్ అడగాలి. ఆ వ్యక్తి ఆ కోడ్ చెప్పలేకపోతే అతనితో వెళ్లకూడదని గట్టిగా చెప్పాలి.

గుడ్ టచ్ - బ్యాడ్ టచ్: పిల్లల శరీర హద్దుల గురించి వారికి స్పష్టంగా అవగాహన కల్పించాలి. ఎవరైనా అసౌకర్యంగా తాకితే సైలెంట్‌గా ఉండకుండా గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం ఎలాగో నేర్పించాలి.

నమ్మకమైన వ్యక్తుల నెట్‌వర్క్: ఆపద సమయంలో సాయం కోరడానికి స్కూల్ టీచర్, పోలీస్, సెక్యూరిటీ గార్డ్ లేదా దగ్గరి బంధువుల పేర్లతో కూడిన 3-4 మంది నమ్మదగిన వ్యక్తుల జాబితాను పిల్లలకు నేర్పుతుండాలి.

ఆత్మరక్షణకు అబద్ధానికి తేడా: తప్పు చేసి తప్పించుకోవడానికి చెప్పే అబద్ధానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి చెప్పే అబద్ధానికి ఉన్న వ్యత్యాసాన్ని సున్నితంగా వివరించాలి. ఏ విషయమైనా అమ్మానాన్నలతో దాచకుండా చెప్పే స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు, బయటి వ్యక్తుల విషయంలో మాత్రం ఈ భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని నేర్పించాలి.

ఆఫీసులు ఖాళీ.. బడులకు తాళాలు.. సామూహిక సెలవులో లక్షన్నర మంది ఉద్యోగులు..!!

 

 

 

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

 

 

 

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES