• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /చలికాలంలో జుట్టు విపరీతంగా రాలుతుందా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ 5 నూనెలతో మీ జుట్టుకు కొత్త ప్రాణం!

చలికాలంలో జుట్టు విపరీతంగా రాలుతుందా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ 5 నూనెలతో మీ జుట్టుకు కొత్త ప్రాణం!

చలి తీవ్రత మొదలైంది. వెచ్చని దుస్తులు ధరించడం, ఫుడ్‌ తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఎంత హెయిర్‌ కేర్‌ తీసుకున్నా.. చలికాలం జుట్టు రాలిపోతుంది. అంతేకాదు, కుదుళ్ల ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. ఇంట్లోనే తయారు చేసుకునే నూనెలతో సులభంగా హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

Written ByRenuka Godugu
Published: Nov 17, 2026, 10:02 IST|Updated: Nov 17, 2026, 10:05 IST
joinshare
చలికాలంలో జుట్టు విపరీతంగా రాలుతుందా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ 5 నూనెలతో మీ జుట్టుకు కొత్త ప్రాణం!
Image Credit: Homemade Winter Hair Oil Remedies:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Homemade Winter Hair Oil Remedies: చలికాలం వచ్చిందంటే చాలు.. చుండ్రు సమస్య కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల హెయిర్‌ ఫాల్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కుదుళ్ల ఆరోగ్యం బాగుంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలం కుదుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. చుండ్రు పెచ్చులుగా కూడా ఉండిపోతుంది. దీనివల్ల జుట్టు దురద, రాలిపోవడం కూడా ఎక్కువ అవుతుంది. కుదుళ్లు ఎప్పుడూ మాయిశ్చర్‌ ఉండేలా చూడాలి. తద్వారా కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎలాంటి హెయిర్‌ కేర్‌  ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల నూనెలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు మంచి పోషణ, జీవం కూడా ఇస్తాయి. ప్రధానంగా ఈ నూనెలు చలికాలంలో మన జుట్టుకు ఎంతో అవసరం.

కొబ్బరినూనె..
మన దేశంలో హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్లో ఇది ప్రధనపాత్ర పోషిస్తుంది. మన బామ్మల కాలం నుంచి కూడా జుట్టుకు కొబ్బరినూనె వాడేవారు. ఇది జుట్టును కఠినంగా, పొడిబారకుండా కాపాడుతుంది. మాయిశ్చర్‌ కూడా అందిస్తుంది. కాస్మోటిక్‌ జర్నల్‌ ప్రకారం కూడా తలస్నానం చేసే ముందు జుట్టుకు కొబ్బరినూనె పెడితే ప్రోటీన్‌ లాస్‌ సమస్య కూడా తగ్గుముఖం పట్టింది.

జోజోబా..
జోజోబా ఆయిల్‌ వంటి చిక్కని నూనెలో తలకు ఎక్కువ కాలంపాటు మాయిశ్చర్‌ అందిస్తాయి. అందుకే జోజోబా ఆయిల్‌ది హెయిర్‌ కేర్‌ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తుంది.  కొన్ని చుక్కల నూనె చేతుల్లో వేసుకుని బాగా మసాజ్‌ చేసి వెంటనే తలస్నానం కూడా చేసుకోవచ్చు. ఈ నూనెతో మనం  కొబ్బరి నూనె కూడా వేసుకుని ఉపయోగించవచ్చు.

పొద్దుతిరుగుడు ..
చలికాలం జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టాలంటే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ది కూడా కీలకపాత్ర. ఇందులో లైనోలిక్‌ యాసిడ్‌, కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు మాయిశ్చర్‌ కూడా నిలుపుతాయి. డ్రైస్కిన్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మంచి రెమిడీ. అయితే, ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం తప్పనిసరి. కొంతమందికి ఆయిల్స్‌ మారిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించే అవకాశం ఉంది.

Read Also: కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!
Read Also: బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

బాదం నూనె..
బాదం నూనె కూడా హెయిర్‌ కేర్‌ ఆయిల్స్‌లో ఉపయోగిస్తారు. ఇది జుట్టుపై ఉండే చుండ్రును తొలగిస్తుంది. తలస్నానం చేసే ముందు ఈ స్వీట్‌ బాదం ఆయిల్‌తో హెడ్‌కు బాగా మసాజ్‌ ఇవ్వండి.  ఆ తరవాత తలస్నానం చేయాలి. ఇది కూడా ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం తప్పనిసరి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Trending News
Telugu News