• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /High Magnesium Foods: గుమ్మడి గింజలే కాదు! శరీరంలో మెగ్నీషియం కొరత తీర్చే 6 సూపర్ ఫుడ్స్ ఇవే..!

High Magnesium Foods: గుమ్మడి గింజలే కాదు! శరీరంలో మెగ్నీషియం కొరత తీర్చే 6 సూపర్ ఫుడ్స్ ఇవే..!

High Magnesium Foods: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒక్క సర్వింగ్‌లకు 165 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు కొన్ని రకాల ఆకుకూరలు, గింజలు, పప్పుదినుస్సుల్లో కూడా సరైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని డైట్లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం లభిస్తుంది.

Written ByRenuka Godugu
Published: Sep 16, 2026, 12:40 PM IST|Updated: Sep 16, 2026, 12:43 PM IST
joinshare
High Magnesium Foods: గుమ్మడి గింజలే కాదు!  శరీరంలో మెగ్నీషియం కొరత తీర్చే 6 సూపర్ ఫుడ్స్ ఇవే..!
Image Credit: High Magnesium Foods

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

High Magnesium Foods: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒక్క సర్వింగ్‌లకు 165 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు కొన్ని రకాల ఆకుకూరలు, గింజలు, పప్పుదినుస్సుల్లో కూడా సరైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని డైట్లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం లభిస్తుంది.

ఒక ఔన్సు గుమ్మడి గింజల్లో 165 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అయితే, కేవలం గుమ్మడి గింజలు మాత్రమే కాదు.. మరో 6 ఫుడ్స్‌లో కూడా మీకు కావాల్సినంత మెగ్నీషియం లభిస్తుంది. మీ రోజువారీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం లేమికి చెక్‌ పెట్టొచ్చు.

పాలకూర..
ఒక కప్పు పాలకూరలో 160 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది గుమ్మడి గింజల ఒక సర్వింగ్‌లకు సమానం. ఇక పాలకూరలో కేవలం మెగ్నీషియం మాత్రమే కాదు.. విటమిన్‌ కే, యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఉంటాయి. దీన్ని పప్పు, కూర లేదా స్మూథీ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

క్వినోవా..
ఒక కప్పు క్వినోవాలో 120 మిగ్రా మెగ్నీషియం లభిస్తుంది. క్వినోవాలో ఫైబర్‌తోపాటు హై క్వాలిటీ ప్లాంట్‌ ప్రోటీన్‌ కూడా ఉంటుంది. అంతేకాదు ఇది గ్లూటెన్‌ ఫ్రీ. విటమిన్‌ బీ, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. క్వినోవాను రైస్‌ బదులుగా కూడా తిటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో జావ మాదిరి తయారు చేసుకుని తీసుకోవాలి.

బ్రేజిల్‌ నట్స్‌..
బ్రేజిల్‌ నట్స్‌లో కూడా ఆరు నట్స్‌ కలిసి 107 గ్రాముల మెగ్నీషియం లభస్తుంది. ఇందులో సెలీనియం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ రోజువారీ అవసరాలకు ఇది సరిపోతుంది.

ఎడమామె..
ఒక కప్పు ఎడమామెలో 100 మీగ్రా మెగ్నీషియం లభిస్తుంది. ఇది కూడా మొక్కల ఆధారిత ప్రోటీన్‌. ఇందులో ఐసోఫ్లేవోన్స్‌ కూడా ఉంటాయి. ఇది ఎముక, కార్డియో ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం. ఈ ఎడమామె ఉడికించి తినవచ్చు. దీనిపై సముద్రపు ఉప్పు జల్లుకుని తినాలి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

టోఫు..
టోఫులో కూడా మెగ్నీషియం ఉంటుంది. 1/2 బ్లాక్‌లో 100 మీగ్రా మెగ్నీషియం లభిస్తుంది. ఇది కూడా మొక్కల ఆధారిత ఖనిజం. ఇందులో కూడా ప్రోటీన్‌, కాల్షియం అధికంగా ఉంటుంది. సాధారణంగా టోఫును సూప్‌, శాండ్విచ్‌ లేదా స్మూథీ తయారు చేసుకోవచ్చు.

చియా సీడ్స్‌..
చియా సీడ్స్‌లో కూడా ఒక్క ఔన్సుకు 100 మీగ్రా మెగ్నీషియం లభిస్తుంది. ఈ చిన్న విత్తనాలు ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇందులో కాల్షియం, ప్రోటీన్‌, ఐరన్‌ కూడా లభిస్తుంది. చియా సీడ్స్‌ మనం స్మూథీ, యోగార్ట ఓట్మీల్‌లో తీసుకోవచ్చు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health