• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

Healthy Eating Habits: మనం రోజూ తీసుకునే ఫుడ్‌ మన శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మన లైఫ్‌స్టైల్‌ బాగుండాలి. ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి రాత్రి డిన్నర్‌ వరకు ఆరోగ్యరమైన భోజనం తీసుకోవాలి. ఇప్పటి లాగే 20 ఏళ్ల తర్వాత కూడా సూపర్‌ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే, మీ రెగ్యులర్‌ డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరిగా చేయండి. ఎలాంటి రోగాలు మీ దరిచేరకుండా ఉంటాయి.

Written ByRenuka Godugu
Published: Oct 05, 2026, 01:31 PM IST|Updated: Oct 05, 2026, 01:34 PM IST
joinshare
20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!
Image Credit: Healthy Eating Habits

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

2

Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

3

గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!

4

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ.. జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..

5

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

మనం తీసుకునే ఆహారమే మన ఎలా ఉన్నామో చెబుతుంది. అది మన ముఖంలో కూడా కనిపిస్తుంది. సెలబ్రిటీలు హెల్తీ ఫుడ్‌ తీసుకుంటారు. పండ్లు, కూరగాయలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారి వయస్సుకు తక్కువగా కనిపిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం మనం తీసుకునే ఫుడ్‌ 20 ఏళ్లు తక్కువగా ఉండేలా చేస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు ఏం తీసుకోబోతున్నాం అని ఓ పది నిమిషాలు ఆలోచించాలి. హెల్తీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లంచ్‌, డిన్నర్‌కు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి. సింపుల్‌గా మీ డైట్‌లో కొన్ని రకాల ఫుడ్స్‌ చేర్చుకోవాలి.

ఆరోగ్య నిపుణులు ప్రకారం ప్రతిరోజూ ఒక గ్లాసు నీటితో మన రోజు ప్రారంభం కావాలి. మీరు నాన్‌ వెజిటేరియన్స్‌ అయితే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఒక గ్లాసు వెజిటేబుల్‌ జ్యూస్‌ తీసుకున్న సరిపోతుంది.  ఇక లంచ్‌ సమయంలో జొన్న రొట్టె తీసుకోవచ్చు. నాన్‌ వెజిటేరియన్స్‌ చికెన్‌, చేప కూడా డైట్‌లో చేర్చుకోవాలి. గ్రీన్‌ టీ కూడా తాగాలి.

ఇక రాత్రి డిన్నర్‌ విషయానికి వస్తే చికెన్‌ లేదా చేప తినాలి. సూప్‌, సలాడ్‌, రోటీ తీసుకోవాలి. వీటితోపాటు కూరగాయలతో చేసిన కూర, పప్పు, సలాడ్‌ చేర్చండి. అంటే ప్లేట్‌ పూర్తిగా సమతుల ఆహారం తీసుకోవాలి. అంతేకాదు ప్రోటీన్‌, కొవ్వు, కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌ తినండి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్‌ తినాలి. మీరు కరెక్ట్‌గా డైట్‌ ప్లాన్‌ చేసుకుంటే మీకు లెక్కలేనంత ఆరోగ్యం కూడా.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

ఆరోగ్యకరమైన ఫుడ్‌ తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా మీ దరిచేరకుండా ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారంతో హై బ్లడ్‌ ప్రెజర్‌ సమస్యలు కూడా వస్తాయి. పోషకాహారం లేమి ఫుడ్‌ తింటే ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు మనం తీసుకునే ఫుడ్‌ మన రోజువారీ మూడ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఒమేగా 3 కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ ఉండే ఫుడ్స్‌ తినాలి. ఇది మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అదేవిధంగా ప్రాసెస్‌ చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు మన శరీరంపై నెగిటివ్‌ ప్రభావం చూపిస్తాయి. ఈ ఖనిజాలు మన శరీర ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health