ముఖ్యంగా ఇందులో లభించే అనేక రకాల పోషకాలు చెడు కొవ్వును కరిగించి గుండెను సురక్షితంగా ఉంచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.
అంతేకాకుండా ఇందులో లభించే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారించి అనేక రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎక్కువగా నారింజ పండ్లను తినడం శరీరానికి ఎంతో మంచిది..
అలాగే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 30 రోజులపాటు క్రమం తప్పకుండా తింటే చర్మం తేమగా మారుతుంది.
ముఖ్యంగా 30 రోజులపాటు రోజు తినగలిగితే అందులో లభించే.. విటమిన్ సి తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే ఇందులో విటమిన్ బి9 తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి రోజు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది..
నారింజపండులో 90 నుంచి 100 శాతం వరకు విటమిన్ సి లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్క పండులో మూడు గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటుంది.
పిల్లలతోపాటు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా నారింజ పండ్లు తింటూ ఉంటారు. ఇవి తీపి పులుపు రుచిని కలిగి ఉంటాయి.