• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /దూసుకోస్తోన్న మరో తుపాను.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

దూసుకోస్తోన్న మరో తుపాను.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

Avkan Toofan: ఆంధ్ర ప్రదేశ్‌ను ఒక దాని తర్వాత మరొక తుపానులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆర్నబ్, మురసు తుపానుల నుంచి కోలుకోని ఏపీ వాసులను మరో తుపాను వణికిస్తోంది. అంతేకాదు తీర ప్రాంత వాసులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 07:56 IST|Updated: Nov 17, 2026, 13:18 IST
joinshare
దూసుకోస్తోన్న మరో తుపాను.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
Image Credit: Toofan Effect (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Alert: ఏపీని వరుసగా తుపానులు వెంటాడుతున్నాయి. అర్నబ్‌, మురసు తుఫాన్ల బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ రాబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  ఇప్పటికే ఆర్నాబ్ తుపాను ఏపీలోని పలు తీర ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా ఏ తుపాను కలిగించడని అతి భారీ నష్టం కలిగించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు తుపాను కారణంగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. తుపాను ముందు తర్వాత చూస్తే ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలకు ప్రభుత్వం తెలియజేసింది.  బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ అది తీవ్ర తుఫాన్‌గా మారనుంది. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయానికి అతి తీవ్ర తుఫానుగా మారి నెల్లూరు – తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని  భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఇంకా కోలుకోని ఏపీ..
ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ కు 910కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది  గంటకు 6 కి.మీ వేగంతో కదులుతున్నట్టు చెబుతున్నారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు తెలుస్తోంది.

నవంబర్ 20న తీరం దాటనున్న అక్వాన్ తుఫాన్..

వాయువ్య దిశగా కదులుతూ, ఇది 20వ తేదీన మధ్యాహ్నానికి నెల్లూరు, తుని మధ్య తీరాన్ని అతి తీవ్రమైన తుపానుగా దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే నేపథ్యంలో  మత్స్యకారులు ఈ సమయంలో  చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ ..

దీని ప్రభావం వల్ల, 19, 20 తేదీల్లో  తీరప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 120-145 కిమీ వేగంతో బలమైన ఈదుగు గాలులు వీచే అవకాశం ఉంది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా హోర్డింగులు, కరెంట్ స్తంభాలు ఈదురు గాలులు ధాటికి పడిపోయే అవకాశాలున్నాయని ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Rain News
Trending News