SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ వైపు దూసుకొస్తోన్న తుపాను.. బిగ్ అలర్ట్..

Avkan Toofan: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. మొత్తంగా ఏపీ వైపు తుపాను దూసుకువస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 08:10 AM IST | Updated: Nov 14, 2026, 08:13 AM IST
Image Credit: Toofan Big Alert (ZEE News Telugu/Source)
Join

AP Toofan: ఆంధ్ర ప్రదేశ్‌కు  మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొరసాగుతున్న  ఉపరితల ఆవర్తన ప్రభావంతో  అల్పపీడనంగా  ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన అల్పపీడనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వైపుగా కదులుతోందని చెప్పుకొచ్చుు.

దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు తీరం వైపుగా కదులుతున్న అల్పపీడనం..

రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  వర్షాలు విస్తారంగా  కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  దీని కారణంగా  సముద్రం కూడా అల్లకల్లోలంగా వుంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


అల్లకల్లోలంగా సముద్రం, చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక ..
ఆక్వాన్ తుపాను ప్రభావం.. ఆర్నాబ్ లాగే తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీచే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు విరిగిపడిపోయే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. విద్యుత్ సహా ఇతర అత్యవసర విభాగాలను ముందుగానే అప్రమత్తం చేసి విద్యుత్ స్తంభాలు విరిగపోయిన చోట యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులతో పాటు ప్రజలకు తాగు నీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు వర్షాల కారణంగా మునిగిపోయే అవకాశాలున్న ప్రాంతాల్లోని ప్రజలను సమీపంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వాళ్లకు పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే నేపథ్యంలో మత్స్యకారులెవరు చేపల వేటకు వెళ్లొద్దరి హెచ్చరికలు జారీ చేసింది.  ఈ వర్షాలు, గాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండరాదని ప్రజలకు సూచించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES