SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CBN Meet To Modi: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీకి సంబంధించి కీలక విజ్ఞప్తులు

AP CM Chandrababu Meet To PM Modi: ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి కీలక విజ్ఞప్తులు చేశారు. గోదావరి పుష్కరాలతోపాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించి విన్నవించారు. ప్రధానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తులు తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 09, 2026, 12:37 AM IST | Updated: Oct 09, 2026, 12:41 AM IST
Image Credit: Chandrababu Narendra Modi Meet
Join

Chandrababu Meet To PM Modi: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు సాధిస్తాయని తెలిపారు. కేంద్రం చొరవ, రాష్ట్రాల సమన్వయంతో నీటి కష్టాలకు చెక్ పడుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల పాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ సేవలను సీఎం చంద్రబాబు కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారత దేశ గమనాన్ని మర్చారని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.

పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతోపాటు గోదావరి - కావేరి నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం పూర్తయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందుతుందని తెలిపారు. నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళితే వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు.. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీని కోరారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని.. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి ఏపీలోని గడ్డు పరిస్థితులను సీఎం చంద్రబాబు  వివరించారు. కరువు నష్టాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి తెలిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని కోరారు. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలతోపాటు విశాఖ మెట్రోను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES