SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu naidu: సాక్ష్యాలతో మీ బట్టలూడదీస్తాం.!. ఏపీ డీఎస్సీ వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Ap dsc row: విజయవాడలో గురువులపై కొంత మంది రౌడీలు దాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని... కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం వేదికగా హెచ్చరించారు.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 21, 2026, 03:40 PM IST | Updated: Sep 21, 2026, 03:47 PM IST
Image Credit: chandrababunaidu(file)
Join


Ap cm Chandrababu naidu fires on ys Jagan  in kuppam: ఏపీలో ప్రస్తుతం డీఎస్సీ వివాదంపై దుమారం చెలరేగింది. ముఖ్యంగా డీఎస్సీ అంశంపై విజయవాడలోని బెజవాడ సర్కిల్ లో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనలకు దిగారు. అంతే కాకుండా.. ఏపీ కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుప్పంలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.  డీఎస్సీ వివాదంపై మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. సాక్ష్యాలతో మీ బట్టలూడదీసే ధైర్యం మాకుందని, పిచ్చిపిచ్చిగా ఆటలాడితే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు తెల్చిచెప్పారు. ఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నిరసనలకు దిగారు. 

ఇక ఫేక్ పార్టీ, గొడ్డలి పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని చంద్రబాబు మండిపడ్డారు. తాను ప్రస్తుతం 17 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నాని తన హయాంలో అసలు ఎప్పుడుపేపర్ లీక్ కాలేదని తెల్చిచెప్పారు. డీఎస్సీ నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ప్రభుత్వంపై బురదచల్లడం ఏంటని మండిపడ్డారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని టీచర్లు తిప్పడికొడుతున్నారని ఏపీ సీఎం ఏకీపారేశారు. జగన్ కు చెందిన ఫేక్ పేపర్‌కు చెందిన రిపోర్టర్ ఒక ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే... వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోవాలన్నారు. 

వీరిపై చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఉందన్నారు. 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీకి ఇంకా బుద్దిరాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక్కసీటు రాకుండా ప్రజలు వైసీపీకి బుద్ది చెప్పాలన్నారు.  

Read more: Tirumala: తిరుమలలో మళ్లీ అపచారం.. బూట్లతో అలిపిరి మెట్లు ఎక్కుతున్న భక్తులు.. వీడియోపై దుమారం..

2019-24 మధ్య రాష్ట్రంలో ఘోరమైన విధ్వంసం జరిగిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
రౌడియిజం చేసే వారి తోక కత్తిరిస్తామని..విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా..?.. లేక మానసిక రోగులు అనాలా..? అంటూ చంద్రబాబు కుప్పం వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES