• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీ డీఎస్సీ 2026 బిగ్ అప్‌డేట్.. మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..!!

ఏపీ డీఎస్సీ 2026 బిగ్ అప్‌డేట్.. మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..!!

AP DSC 2026: ఏపీలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది.

Written ByBhoomi
Published: Nov 12, 2026, 12:15 PM IST|Updated: Nov 12, 2026, 12:18 PM IST
joinshare
ఏపీ డీఎస్సీ 2026 బిగ్ అప్‌డేట్.. మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..!!
Image Credit: AP DSC 2026:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

2

India vs New Zealand Playing 11: నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. ముగ్గురు ప్లేయర్లు ఎంట్రీ..!

3

ఇల్యూజరీ సుపీరియారిటీ: చుట్టూ ఉన్నవారి ఫేక్ పొగడ్తలను నమ్మితే జరిగేది ఇదే.. సింహం - తోడేళ్ల కథ...!!

4

Srikalahasti Temple: శ్రీకాళ హస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు.. అసలేం జరిగిందంటే..?

5

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP DSC 2026: ఏపీలో  ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. ఆసక్తి,  అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 30వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నియామకాలకు సంబంధించి గత నెలలో ప్రాథమిక ప్రకటన వెలువరించిన విద్యాశాఖ, నవంబరు 4న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అప్లికేషన్ లింక్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. యాజమాన్యాలు, విభాగాల వారీగా పోస్టుల కేటాయింపు ఈ  క్రింది విధంగా ఉంది.

జనరల్ స్కూల్ (SA, SGT): 2,111 పోస్టులు

ప్రత్యేక విద్య (SA, SGT): 350 పోస్టులు

సొసైటీ, ఇతర యాజమాన్యం (ప్రిన్సిపాల్, PGT, TGT, PD, PET): 260 పోస్టులు

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహించబడే ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2026

ఆన్‌లైన్ మాక్ టెస్ట్: అభ్యర్థులు ప్రాక్టీస్ చేయడానికి డిసెంబర్ 5న అందుబాటులో ఉంటుంది.

హాల్ టికెట్ విడుదల: అభ్యర్థులు డిసెంబర్ 14 నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీలు: పరీక్షలు డిసెంబర్ 20 నుండి జనవరి 13 వరకు జరుగుతాయి.

ప్రిలిమినరీ ఆన్సర్ కీ: ఫైనల్ పరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత విడుదల చేస్తారు.

అభ్యంతరాల స్వీకరణ: ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి అభ్యర్థులకు ఒక వారం సమయం ఇవ్వనున్నారు.

తుది జవాబు కీ: అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మరో వారం రోజులకు తుది జవాబు కీని ప్రకటిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నియామక ప్రక్రియను వేగవంతం చేయడంతో, అభ్యర్థులలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో తలెత్తే సాంకేతిక సమస్యలను నివారించడానికి, అర్హులైన అభ్యర్థులు గడువు తేదీకి చాలా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

Also Read: 

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

 

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Telugu News