• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

AP Panchayat Election Unanimous: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల చర్చ జోరందుకుంది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు, రూ.కోటి, రూ.50 లక్షలు ఇస్తామంటూ కొందరు ముందుకొస్తున్నట్లు సమాచారం. మరికొన్ని గ్రామాల్లో భూమి ఇస్తామనే ప్రతిపాదనలు, వేలం తరహా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి చిత్తూరు వరకు ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Written ByHarish Darla
Published: Nov 12, 2026, 01:29 PM IST|Updated: Nov 12, 2026, 01:35 PM IST
joinshare
AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

2

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌పై 1+1 ఫ్రీ ఆఫర్.. ఏకంగా 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా!

3

తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. మీ భూమి సర్వే అయ్యిందా? మారనున్న కొత్త రూల్స్ ఇవే..!!

4

AP Local body Elections: ఏపీలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ..

5

AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Panchayat Election Unanimous: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో రాజకీయ చర్చలు మొదలయ్యాయి. అయితే పోలింగ్‌కు ముందే కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకోవాలనే ప్రయత్నాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు గ్రామంలో రాజకీయ విభేదాలు, గొడవలు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో కొందరు గ్రామ పెద్దలు ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో గ్రామాభివృద్ధి పేరుతో భారీ ఆర్థిక హామీలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రాంతంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.2 కోట్లు ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు సమాచారం. గ్రామంలో డ్రెయిన్ల నిర్మాణం, బస్టాండ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ మొత్తాన్ని వినియోగిస్తానని ఆయన చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని మరో గ్రామంలోనూ ఇలాంటి ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ. కోటి విరాళంగా అందిస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని గ్రామ పెద్దల సమక్షంలో అందజేస్తానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసినట్లు సమాచారం.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఓ గ్రామంలో పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించి ఏకగ్రీవంపై చర్చించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి గ్రామాభివృద్ధికి వారు చేయగలిగే సహకారంపై వివరాలు అడిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒకరు రూ.50 లక్షలు ఇస్తానని, మరొకరు ఎకరం పొలం ఇస్తానని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ రచ్చబండ సమావేశాలు, ఏకగ్రీవ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సత్యవేడు మండలంలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం నిర్వహించినట్లు చెబుతున్న వేలం రూ.15 లక్షల వరకు చేరగా, గ్రామ పెద్దలు దాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

అయితే ఏకగ్రీవ ఎన్నికల పేరుతో డబ్బులు లేదా ఆస్తుల హామీలు ఇవ్వడం, వేలం తరహా వ్యవహారాలు నిర్వహించడం వంటి అంశాలపై చట్టపరమైన నిబంధనలు, ఎన్నికల అధికారుల మార్గదర్శకాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిపాదనలు నిజంగా అమలవుతాయా? గ్రామస్థులు ఏకాభిప్రాయానికి వస్తారా? లేక చివరకు ఎన్నికల బరిలో అభ్యర్థులు పోటీ పడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Andhra Pradesh
AP News
Telugu News