• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఇల్యూజరీ సుపీరియారిటీ: చుట్టూ ఉన్నవారి ఫేక్ పొగడ్తలను నమ్మితే జరిగేది ఇదే.. సింహం - తోడేళ్ల కథ...!!

ఇల్యూజరీ సుపీరియారిటీ: చుట్టూ ఉన్నవారి ఫేక్ పొగడ్తలను నమ్మితే జరిగేది ఇదే.. సింహం - తోడేళ్ల కథ...!!

Illusory Superiority psychology: పవర్, స్టేటస్ ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తించి గ్రౌండెడ్‌గా ఉండటం అలవాటు చేసుకుంటేనే లైఫ్‌లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఎదురైనా తట్టుకుని నిలబడగలం. లేదంటే తోడేళ్ల గుంపును నమ్ముకున్న ఆ సింహంలాగే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది.

Written ByBhoomi
Published: Nov 12, 2026, 01:10 PM IST|Updated: Nov 12, 2026, 01:12 PM IST
joinshare
ఇల్యూజరీ సుపీరియారిటీ: చుట్టూ ఉన్నవారి ఫేక్ పొగడ్తలను నమ్మితే జరిగేది ఇదే.. సింహం - తోడేళ్ల కథ...!!
Image Credit: Illusory Superiority psychology

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

2

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌పై 1+1 ఫ్రీ ఆఫర్.. ఏకంగా 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా!

3

తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. మీ భూమి సర్వే అయ్యిందా? మారనున్న కొత్త రూల్స్ ఇవే..!!

4

AP Local body Elections: ఏపీలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ..

5

AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Illusory Superiority psychology: మన లైఫ్‌లో మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు, మన దగ్గర పవర్ లేదా డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది చేరుతారు. మనల్ని పొగుడుతూ, మన వెంటే తిరుగుతూ మనం ఏం చేసినా గ్రేట్ అని భజన చేస్తుంటారు. అయితే వాళ్లంతా నిజంగా మన మంచిని కోరుకునేవారా? లేక మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ కోసం వచ్చినవారా? అనేది మనం గుర్తించలేకపోతాం. ఈ ఇల్యూజన్ (భ్రమ) లో పడి మన రియల్ స్ట్రెంత్‌ని, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లని దూరం చేసుకుంటే చివరికి మిగిలేది ఒంటరితనం ఫెయిల్యూర్ మాత్రమే. ఈ హార్ష్ రియాలిటీని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక చిన్న కథను, దీని వెనుక ఉన్న సైకాలజీని ఇప్పుడు తెలుసుకుందాం.

సింహం - తోడేళ్ల గుంపు కథ:
ఒక దట్టమైన అడవిలో చాలా స్ట్రాంగ్‌గా ఉండే ఒక సింహం ఉండేది. అది వేటాడటం మొదలుపెడితే అడవిలోని జంతువులన్నీ భయపడిపోయేవి. ఆ సింహం ఎక్కడికి వెళ్లినా దాని వెనుక ఒక తోడేళ్ల గుంపు నీడలా తిరుగుతూ ఉండేది. సింహం వేటాడి కడుపునిండా తిన్న తర్వాత మిగిలిపోయిన మాంసాన్ని ఆ తోడేళ్లు తింటూ ఆకలి తీర్చుకునేవి. సింహం ఎటు వెళితే అటు వెళ్తూ తోడేళ్లు ఎప్పుడూ దాని చుట్టూనే ఉండేవి.

రోజులు గడిచేకొద్దీ తన వెనుక ఇంత పెద్ద గ్యాంగ్ ఉందనే ఆలోచన సింహంలో ఇగో (అహం), గర్వాన్ని పెంచింది. తోడేళ్ల గుంపు తనకు భయపడి, తన గ్రేట్‌నెస్‌కి ఫ్యాన్స్ అయిపోయి వెంబడిస్తున్నాయని సింహం భ్రమపడింది. ఆ గర్వంతో తన స్టేటస్‌ని మర్చిపోయి, తనతో సమానమైన తోటి సింహాలను కూడా తక్కువ చేసి చూడటం మొదలుపెట్టింది. వాటితో కలవడం, మాట్లాడటం పూర్తిగా మానేసింది. కేవలం తన చుట్టూ తిరిగే తోడేళ్లే తన అసలైన బలం అనుకుంటూ టైమ్ గడిపింది.

టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! కొన్నాళ్లకు ఆ సింహానికి వయసు పైబడింది. ఒకప్పటి స్పీడ్, ఎనర్జీ తగ్గిపోయి మెల్లగా వీక్ అవ్వడం మొదలైంది. మునుపటిలా వేటాడటం దానికి కష్టమైంది. సింహం బలహీనపడిందని గమనించిన తోడేళ్లు నెమ్మదిగా దాని మాట వినడం మానేశాయి. ఒకప్పుడు దాని ముందు తలవంచి నడిచిన తోడేళ్లు ఇప్పుడు దానిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాయి. మరికొన్నాళ్లకు సింహం పూర్తిగా వీక్ అయిపోయి, కనీసం కదలలేని స్టేజ్‌కి చేరుకుంది. అదను కోసం ఎదురుచూస్తున్న ఆ తోడేళ్ల గుంపు అంతా ఒక్కసారిగా ఆ సింహంపై అటాక్ చేసి, దానిని పీక్కుతిని తమ ఆకలి తీర్చుకున్నాయి. అలా తన చుట్టూ ఉన్నవారిని గుడ్డిగా నమ్మిన ఆ సింహం లైఫ్ చాలా దారుణంగా ఎండ్ అయిపోయింది.

సైకాలజీ టెర్మినాలజీలో ఈ పరిస్థితిని ప్రధానంగా రెండు రకాలుగా వివరిస్తారు. మొదటిది నార్సిసిస్టిక్ సప్లై (Narcissistic Supply). అంటే, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని పొగుడుతూ ఉంటే మన ఇగోకి దొరికే ఒక రకమైన కిక్ అన్నమాట. ఈ పొగడ్తలకు బానిసైనప్పుడు మనం నిజాయితీగా విమర్శించే మన సొంత వాళ్లని దూరం చేసుకుంటాం. రెండోది ఫెయిర్-వెదర్ ఫ్రెండ్స్ (Fair-weather Friends) అంటే, మన దగ్గర ఏదైనా లాభం ఉన్నంత వరకే మనతో ఉండి, మన టైమ్ బాగోలేనప్పుడు మనల్ని వదిలేసే లేదా మనల్నే నాశనం చేసే స్వార్థపూరిత వ్యక్తులు. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని పొగుడుతుంటే మనమే గొప్పవాళ్లమనే భ్రమలో పడిపోవడాన్ని సైకాలజీలో ఇల్యూజరీ సుపీరియారిటీ (Illusory Superiority) అని కూడా పిలుస్తారు.

ఫేక్ సర్కిల్ పట్ల అప్రమత్తత:
లైఫ్‌లో మన చుట్టూ ఉండే మనుషుల మెంటాలిటీని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మన పొజిషన్‌ని, మనీని చూసి దగ్గరయ్యే వాళ్లు ఎప్పటికీ మన సొంతం కారు. వాళ్లు కేవలం తమ నీడ్స్ కోసం మాత్రమే మన వెనుక తిరుగుతుంటారు. అలాంటి వాళ్లని చూసి గర్వపడటం అంటే మన గోతిని మనమే తవ్వుకోవడం లాంటిది. మన పవర్ తగ్గినప్పుడు లేదా మనకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ తోడేళ్ల లాంటి మనుషులు మనల్ని వదిలేయడమే కాకుండా, ఛాన్స్ దొరికితే మనల్ని దెబ్బతీయడానికి కూడా వెనుకాడరు.

రియల్ స్ట్రెంత్‌ని గుర్తించడం:
మనిషికి అసలైన బలం చుట్టూ ఉండే క్రౌడ్ కాదు, మన క్యారెక్టర్  మనల్ని ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ప్రేమించే కొద్దిమంది జెన్యూన్ పీపుల్ మాత్రమే. మన స్థాయికి తగిన వాళ్లతో, మన గ్రోత్‌ని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లతో ఎప్పుడూ మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. పవర్, స్టేటస్ ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తించి గ్రౌండెడ్‌గా ఉండటం అలవాటు చేసుకుంటేనే లైఫ్‌లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఎదురైనా తట్టుకుని నిలబడగలం. లేదంటే తోడేళ్ల గుంపును నమ్ముకున్న ఆ సింహంలాగే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. 

Also Read: 

 

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

 

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Moral Stories
Motivational Stories
Telugu News