Fire Accident in srikalahasti temple premises: ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో కొలువైన ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదాల తయారీ కేంద్రంలో సిలిండర్ పేలడంతో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు,సిబ్బంది భయంతో బైటకు పరుగులు పెట్టారు. అప్పటికే మంటలు ఆలయం చుట్టుపక్కల వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలతో అధికారుల ప్రాథమిక ప్రయత్నాలు చేశారు.
శ్రీకాళహస్తి ఆలయం ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. - గ్యాస్ లీక్ అవ్వడంతో చెలరేగిన మంటలు.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది - ప్రసాద తయారీ కేంద్రానికి దూరంగా భక్తులను పంపిస్తున్న ఆలయ సిబ్బంది https://t.co/2VL4WossIF
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) November 12, 2026
వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనలో ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై తెలియాల్సి ఉంది. మరోవైపు కార్తీక మాసం కావడంతో శ్రీకాళ హస్తిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.