SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

AP DSC 2.o Notification 2026: విద్యాశాఖలోని కీలక నిర్ణయాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయ నియామకాలపై ఈ సమావేశం జరిగింది. వచ్చే నెల రోజుల్లోనే డీఎస్సీ 2.0 (DSC 2.0) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Written By Harish Darla
Published: Oct 02, 2026, 06:58 AM IST | Updated: Oct 02, 2026, 07:01 AM IST
Join

AP DSC 2.o Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఏపీ రిక్రూట్‌మెంట్ మోడల్ వైపు దేశమంతా చూస్తోందని.. కాబట్టి డీఎస్సీ 2.0 నియామకాల్లో పారదర్శకతకు, వేగానికి పెద్దపీట వేయాలని ఆయన ఆదేశించారు. రాబోయే నెల రోజుల్లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పాఠశాల విద్య, 'మిషన్ మార్చ్'.. 
ఏపీలోని ప్రభుత్వ బడులలో పదో తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా 'మిషన్ మార్చ్' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వెనుకబడిన విద్యార్థుల చదువు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు.

అలాగే పిల్లలు చదువును మధ్యలోనే నిలిపేయకుండా 'జీరో డ్రాప్‌అవుట్ మిషన్' అమలు చేయాలన్నారు. బడికి దూరమైన పిల్లలు భవిష్యత్తులో మాదకద్రవ్యాల వంటి వ్యసనాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందన్న సింగపూర్ మంత్రి షణ్ముగం సూచనలను ఈ సందర్భంగా లోకేష్ ప్రస్తావించారు. స్కూల్ డ్రాప్‌అవుట్స్ నివారణలో కమ్యూనిటీ లీడర్లను అందులో భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలోని 175 పాఠశాలలను 'లీప్ స్కూల్స్'గా తీర్చిదిద్ది మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

యూనివర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు డిసెంబర్ నెలలో రాత పరీక్ష నిర్వహిస్తామని మంత్రికి అధికారులు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నందున ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు.

ప్రత్యేక కేంద్రాలు, విశాఖ లైబ్రరీ.. 
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలను రచిస్తూనే..  పరిశోధకులు, విద్యార్థులు, సాధారణ ప్రజల కోసం ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ లైబ్రరీ నిర్మించే ప్రతిపాదనలను చర్చించారు. రాష్ట్ర విద్యాశాఖలోని ప్రతి విభాగంలోనూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు నిర్దేశించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES