SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Free Bus Travel: మహిళలకు గుడ్‌న్యూస్..ఇకపై ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం!

AP AC Bus Free Women Travel: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న 'స్త్రీశక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరిస్తూ, త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.

Written By Harish Darla
Published: Sep 30, 2026, 06:48 PM IST | Updated: Sep 30, 2026, 06:53 PM IST
Join

AP AC Bus Free Women Travel: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్త్రీశక్తి' పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితమైంది. అయితే సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ బస్సులు, నాన్ స్టాప్, అంతరాష్ట్ర బస్సులు, తిరుమల - తిరుపతి మధ్య నడిచే సప్తగిరి బస్సుల్లో ఈ పథకం వర్తించడం లేదు. అయితే మహిళల కోసం ఏపీ బస్సులోనూ ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇందుకోసం రవాణా శాఖ ద్వారా నూతన ఏసీ బస్సులను కొనుగోలు చేసిన అనంతరం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడలో బుధవారం జరిగిన 'పేదలకు పట్టాభిషేకం' సభలో సీఎం చంద్రబాబు పాల్గొని 26,400 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

గతంలో విశాఖపట్నం, మంగళగిరి ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60,000 మంది పేదలకు నివేశన స్థలాల పట్టాలు అందించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన ఈ విలువైన ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని, తమ భవిష్యత్తు, పిల్లల ప్రయోజనాల కోసం భద్రపరుచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

పాలనలో మార్పు..
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ 'జెడ్ స్పీడ్'తో అభివృద్ధి పనులు చేపడుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో భూసర్వే పేరుతో గ్రామాల్లో వివాదాలు సృష్టించారని, పట్టాదారు పాస్‌బుక్‌లపై తమ ఫొటోలు ముద్రించుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ బొమ్మలను తొలగించి, అధికారిక ప్రభుత్వ రాజముద్రతో నూతన పాస్‌బుక్‌లను పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే మూడు భాగస్వామ్య పార్టీలు కలిశాయని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES