SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Raptadu Girl Incident: రంపం దాడి ఘటనతో షాక్‌లో స్కూల్ విద్యార్థులు.. మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం..

Nara Lokesh on Raptadu incident: అనంతపురంలోని రాప్తాడు ఘటనను చూసిన కొంత మంది విద్యార్థులు షాక్ నుంచి ఇంకా తెరుకొలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈక్రమంలో మంత్రి నారాలోకేష్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 01, 2026, 11:22 AM IST | Updated: Nov 01, 2026, 11:38 AM IST
Image Credit: nara lokesh (file)
Join

Ap Govt orders Special counselling support over raptadu incident: అనంతపురం జిల్లా రాప్తాడులోని స్కూల్ లో ఉన్మాది దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే బాలికకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు రక్త స్రావం ఆగిపోయిందని, ప్రాణాపాయం పూర్తిగా తప్పిందని వైద్యులు చెప్పినట్లు మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు. కొన్ని శరీర భాగాలకు ప్లాస్టిక్ సర్జరీలు అవసరమని వైద్యులు చెప్పారు. మరోవైపు నిందితుడిని పోలీసులు ఇప్పటికే ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే..స్కూల్ లో ఉన్మాది రంపంతో ప్రవేశించడం టీచర్ క్లాసులో పాఠాలు చెప్తుండగానే బాలికపై దాడి చేయడం, క్లాసులో విద్యార్థుల అరుపులు, రక్తపాతం చూసిన  చాలా మంది విద్యార్థులు షాక్ కు గురయ్యారు. 

ఇప్పటికి ఈ ఘటనతో భయంతో అన్నం తినడంలేదని, నిద్రపొవడంలేదని, ఉలిక్కి పడిలేస్తున్నరని కొంత మంది తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం కాస్త మంత్రి నారాలోకేష్ వరకు వెళ్లడంతో విద్యార్థుల్లో ఉన్న భయాందోళనల్ని దూరం చేసేందుకు మంత్రి నారాలోకేష్ కీలక చర్యలు చేపట్టారు.

దీని కోసం  20 మంది సభ్యులతో కౌన్సెలర్లతో ఒక ప్రత్యేక బృందాన్ని  ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన పదో తరగతి సదరు క్లాసులో ఉన్న వారితో పాటు 8, 9, 10 తరగతులకు చెందిన ఇతర విద్యార్థినులకు కూడా కౌన్సెలింగ్  ఇవ్వాలని ఆదేశించారు.  విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని దూరం చేయాలని, వారిలో మరల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలిగేలా వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు విద్యార్థినుల ఇంటికి వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 

మరోవైపు రాప్తాడు ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తికి గంజాయి, మద్యం అలవాటు ఉందని తనతో పెళ్లికి నిరాకరించడం వల్ల ఈ క్రూరత్వంను పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తన అక్క వద్ద ఉన్న ఉన్మాది క్రమంగా అతని అలవాట్లతో విసిగిపోయి ఆమె కూడా ఇంట్లో నుంచి గెంటివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES