SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP High Court On Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..6 వారాల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సిందే!

AP High Court On Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు పచ్చజెండా ఊపుతూ కీలకమైన తీర్పును వెలువరించింది. స్థానిక పోరులో బీసీ అభ్యర్థులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ వాటిని రద్దు చేసింది. అదే క్రమంలో, రాబోయే ఆరు వారాల వ్యవధిలోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Written By Harish Darla
Published: Oct 01, 2026, 12:25 PM IST | Updated: Oct 01, 2026, 12:28 PM IST
Join

AP High Court On Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల కేటాయింపు అంశాలపై దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ తర్వాత తీర్పు వెల్లడించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 105, 1065లను హైకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలకు భిన్నంగా ఈ ప్రభుత్వ జీవోలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లకుండా పోవడంతో, ఇకపై రాజకీయ పార్టీలు తమ స్థాయిలో బీసీ అభ్యర్థులకు ప్రాతినిధ్యం దక్కేలా పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది

వైసీపీ పిటిషన్ల తోసిపుచ్చిన కోర్టు..
ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముగియకుండా ఎన్నికలు నిర్వహించవద్దని, బీసీ జనగణనతో పాటు వార్డుల పునర్విభజన అనంతరమే ఎన్నికలు జరపాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎదురైన చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి ఆరు వారాల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఎన్నికల సన్నాహాలు, పోలింగ్ షెడ్యూల్..
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. తుది జాబితా ప్రచురణ ముగిసిన వెనువెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

దసరా పండుగ తదుపరి ఈ నెలాఖరులోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచనతో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇదివరకే ఎన్నికల సంఘం వెల్లడించిన నేపథ్యంలో, హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక పోరు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES