• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎన్నికల సందడి..నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం..ఈసీ కీలక నిర్ణయం!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎన్నికల సందడి..నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం..ఈసీ కీలక నిర్ణయం!

AP Local Body Elections Nominations: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 100 పుర, నగరపాలక సంస్థలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను సిద్ధం చేయడమే కాకుండా, ఎన్నికల వ్యయం, రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Written ByHarish Darla
Published: Oct 16, 2026, 08:56 AM IST|Updated: Oct 16, 2026, 09:16 AM IST
joinshare
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఎన్నికల సందడి..నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం..ఈసీ కీలక నిర్ణయం!
Image Credit: Source: Zee Telugu News

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

2

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

3

దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

4

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

5

ఒకే మహిళ.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆధార్ లింకింగ్‌తో దొరికిపోయిందిలా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Local Body Elections Nominations: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు ప్రత్యేకంగా 5,485 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలతో పాటు మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 28 జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

రాజకీయ పార్టీల గుర్తులు, నిబంధనలు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పర్యవేక్షణలో ఎన్నికల సన్నాహకాలు పూర్తయ్యాయి. ప్రచార ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఎలాంటి నియమోల్లంఘనలకు పాల్పడకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, గుర్తింపు పొందిన పార్టీలకు మునుపటి ఎన్నికల్లో ఉన్న గుర్తులనే తిరిగి కేటాయించాలని నిర్ణయించారు.

అభ్యర్థుల వ్యయ పరిమితులు..
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు ఇచ్చారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అభ్యర్థికి రూ. 40 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థికి రూ. 15 లక్షలు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవికి రూ. 25 లక్షలు, కార్పొరేటర్ అభ్యర్థికి రూ. 10 లక్షల పరిమితి ఉంది.

అలాగే మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పోటీదారుకు రూ. 20 లక్షలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌కు రూ. 7.50 లక్షల వరకు వ్యయం చేసేందుకు అనుమతించారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌కు రూ. 10 లక్షలు, వార్డు సభ్యునికి రూ. 5 లక్షలను ఈసీ నిర్దేశించింది. ఈ వ్యయ నిబంధనలను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖచ్చితంగా అమలు చేయాలని ఈసీ స్పష్టం చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Andhra Pradesh
AP News
Telugu News