SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీలో పల్లె పోరు ముహూర్తం ఖరారు..! 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. నవంబర్ 13న షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్‌లో పల్లె పోరు మొదలు కానుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్రంలో మొత్తం 13,219 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశకు నవంబర్ 13న, రెండో దశకు 16న, మూడో దశకు 19న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీంతో అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారం అన్నీ దశలవారీగా కొనసాగుతాయి.

Written By Renuka Godugu
Published: Nov 09, 2026, 10:03 AM IST | Updated: Nov 09, 2026, 10:08 AM IST
Image Credit: AP Panchayat Elections Schedule 2026:
Join

AP Panchayat Elections Schedule 2026: ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు పైచేయి సాధించగా, పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారన్నది తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. వాటిలో కూటమి ప్రభుత్వం జోరు ప్రదర్శించింది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగాయి, వాటిలోనూ కూటమి ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పోరు పల్లెల్లోనే. గ్రామాల్లో వర్గ విభేదాలు, పట్టు సాధించేందుకు వివిధ వర్గాల మధ్య పోటీ ఉంటుంది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ పదవి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతతో కూడుకున్నది. ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధి అనే ప్రధాన అజెండాతోనే ముందుకు సాగుతాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం పల్లె పోరుకు సిద్ధమవుతోంది.

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికలు అంటే ఒక రకమైన తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త, పోటీ వాతావరణం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,219 గ్రామ పంచాయతీలు ఉన్నందున వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమైన పని. అందుకే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి దశ పోలింగ్ నవంబర్ 26న, రెండో దశ పోలింగ్ నవంబర్ 29న, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 2న జరగనుంది. మొదటి దశకు నవంబర్ 13న, రెండో దశకు 16న, మూడో దశకు 19న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీంతో అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారం దశలవారీగా కొనసాగనున్నాయి.


ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా ఆధిపత్యం ప్రదర్శించి ముందంజలో నిలిచింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో పార్టీల కన్నా వ్యక్తిగత అభ్యర్థుల ప్రభావం, ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సాధారణంగా అధికార పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పల్లెల్లో ఎవరికి పట్టం కడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం, కోర్టు కేసులు, రాజకీయ కారణాలతో వాయిదా పడటం జరిగింది. ఇప్పుడు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రక్రియ సజావుగా సాగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు… ఇవన్నింటిపైనా వైఎస్ఆర్‌సీపీ కోర్టులను ఆశ్రయించడం, హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కొంత ఊరట లభించడం, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఎదురవడం జరిగింది. రాజకీయంగా చూస్తే ఈ ఎన్నికలు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేన పార్టీలకు కీలక పరీక్షగా మారనున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటి పెద్ద స్థానిక సంస్థ ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు గ్రామాల్లో పట్టు సాధించేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు ఇవి ప్రధానంగా ఉపయోగపడనున్నాయి. అధికార పార్టీ తన పాలనను గ్రామ స్థాయిలో ఎంత సుస్థిరం చేసుకుంటుందో, ప్రతిపక్షాలకు ఎలాంటి సవాలు విసురుతుందో ఎన్నికల్లో తెలియనుంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ఎంపిక, కార్యకర్తల సమీకరణ, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి.

Read Also: ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!
 

ఎన్నికల కమిషన్ తరపున అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా పరిశీలన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు వంటి పనులను ఎన్నికల సంఘం వేగంగా చేస్తోంది. ఓటర్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేవో ముందుగానే తనిఖీ చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఏవైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండటం వల్ల రాష్ట్రంలో మహిళల ప్రాతినిధ్యం ఒక్కసారిగా పెరగనుంది. అలాగే యువత కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు, పథకాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై ప్రజలతో పాటు పార్టీలు కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.

ముఖ్యంగా అభ్యర్థులు తమ గ్రామాల సమస్యలపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్నది నవంబర్ 13న షెడ్యూల్ విడుదలైన తర్వాత పార్టీలు అధికారికంగా ప్రచారం ప్రారంభించనున్నాయి. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణలు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు అన్నీ క్రమంగా జరుగుతున్న నేపథ్యంలో, డిసెంబర్ మొదటి వారంలోనే మూడు దశల పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎవరూ కోర్టు మెట్లు ఎక్కకుండా సహకరించిన నేపథ్యంలో, ఎక్కడా అల్లర్లు సృష్టించకుండా ఉన్న నేపథ్యంలో, ఆ డిసెంబర్ మొదటి వారం లోపే ఈ ఫలితాలన్నీ వెలువడే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES