SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Development: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు

Rural Development, AP Panchayat Raj and Rural Development, Pawan Kalyan, AP News, Chandrababu, SKOCH Award, AP Rural Development, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, పవన్‌ కల్యాణ్‌, స్కోచ్‌ అవార్డు, AP Panchayat Raj and Rural Development Crossed National Level Milestone Between 2024 To 2026 | AP Development: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు AP Panchayat Raj and Rural Development: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో రెండేళ్లలోనే పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అపూర్వ విజయాలు సాధించింది. రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదిక ఇదే.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 27, 2026, 08:04 PM IST | Updated: Sep 27, 2026, 08:07 PM IST
Image Credit: AP Panchayatraj And Rural Development
Join

AP Rural Development: గ్రామీణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత ఫలితాలు, ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో అనేక మైలురాళ్లు అధిగమించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విశేష విజయాలు సాధించింది. గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్య ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. సమ్మిళిత వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనం, నూతన ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యంతో రెండేళ్లలో (2024–2026) జాతీయ స్థాయిలో ఎన్నో మైలురాళ్లను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధిగమించింది.

చారిత్రక నిర్ణయాలు, పాలనా సంస్కరణలు
గ్రామీణ ప్రాంతంలో పాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లస్టర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత వివిధ కేడర్లలో 10,000కు పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 77 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసులు, 15 కొత్త జెడ్పీపీ భవనాలను ప్రారంభించడంతోపాటు 609 గ్రామ పంచాయతీ భవనాలు, 10 జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనాలను మంజూరు చేశారు.

ప్రపంచ రికార్డు, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాలు
గ్రామీణ చైతన్యానికి నిదర్శనంగా 2024 ఆగస్ట్ 23న ఒకే రోజులో ఏకంగా 13,326 గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం 'వరల్డ్ రికార్డ్స్ యూనియన్' గుర్తింపు పొందింది. డిజిటల్ పాలనలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ 'స్వర్ణ పంచాయతీ' వేదిక ద్వారా రూ.వెయ్యి కోట్ల పంచాయతీ సొంత ఆదాయాన్ని (ఓఎస్‌ఆర్‌) పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సేకరించిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఆర్జీఎస్‌ఏ జాతీయ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం 24వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. పంచాయతీలకు డెస్క్‌టాప్ విరాళాల సేకరణలో 'దాన్వీర్ ఇనిషియేటివ్' కింద దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) పూర్తి చేయడంలోనూ వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

అవార్డులు, డిజిటల్ విప్లవం
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న పనులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు సాధించింది. మంచి పాలన, ఆరోగ్యకరమైన, మహిళా అనుకూల, నీటి స్వావలంబన పంచాయతీలు, వాతావరణ చర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఎస్డీజీ లక్ష్యాల సాధన విభాగాలలో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రానికి ఏకంగా 13 జాతీయ అవార్డులు దక్కాయి.

==> డిజిటల్ పాలనకు గుర్తింపుగా 'స్వర్ణ పంచాయతీ పోర్టల్'కు ప్రతిష్టాత్మక స్కోచ్‌ గోల్డ్ అవార్డు-2025
==> 1.66 లక్షల ఎకరాలలో ఉద్యానవన పెంపకం చేపట్టినందుకు రాష్ట్రం మూడు జాతీయ జల అవార్డులతో పాటు 'జన్ సించయ్ జన్ భాగీదారి' అవార్డు
==> నాణ్యతా నిర్వహణ కోసం 32 గ్రామ పంచాయతీలు ISO 9001:2015 ధృవీకరణను సాధించాయి
==> డిజిటలీకరణలో భాగంగా గ్రామ పంచాయతీలకు 2,000 డెస్క్‌టాప్‌లు పంపిణీ
==> పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 4,136 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

స్వచ్ఛత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ
==> గ్రామాల్లో చెత్త సేకరణను క్రమబద్ధీకరించడానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5,000 పుష్ కార్ట్‌లు, 12,000 త్రిచక్ర వాహనాలు, 200 ఇ-ఆటోలు పంపిణీ
==> 'స్వచ్ఛ రథం' ద్వారా రూ.25.2 కోట్ల విలువైన 1.80 కోట్లకు పైగా కిలోల పొడి చెత్తను సేకరించి వనరుల పునరుద్ధరణ
మురుగునీటి నిర్వహణ కోసం 33 కి.మీ మేర వినూత్న 'మ్యాజిక్ డ్రెయిన్స్' నిర్మాణం
==> వ్యవసాయం, నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తూ 1.07 లక్షలకు పైగా ఫామ్ పాండ్లు, 38,300 పశువుల షెడ్లు, 15,500 పశువుల తొట్లు నిర్మాణం

సామాజిక భద్రత, జాతీయ వేడుకలు
కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల కింద 1.3 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులకు బీమా రక్షణ కల్పించారు. విశాఖపట్నంలో 'జాతీయ పెసా మహోత్సవ్', గుంటూరులో 'జాతీయ వాటర్‌షెడ్ మహోత్సవ్'లను విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'విక్షిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' కార్యక్రమం కూడా ఏపీ వేదికగానే ప్రారంభమైంది. పారదర్శకత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం విక్షిత్ ఆంధ్రప్రదేశ్, విక్షిత్ భారత్ సాధనలో గ్రామాలను స్వయం సమృద్ధిగా, సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES