Women Morphing Videos: మార్ఫింగ్ వీడియోలపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం.. నెటిజన్లకు హెచ్చరిక
AP Women Commission Chairperson Rayapati Shailaja Serious About Morphing Videos On Women: సోషల్ మీడియా వేధింపులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సూచించారు. మహిళల మార్ఫింగ్ వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Morphing Videos On Women: ప్రపంచం మొత్తం డిజిటల్ మయం కావడంతో సోషల్ మీడియా తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా మార్ఫింగ్ వీడియోలు, సోషల్ మీడియాలో వేధింపులు తీవ్రమవుతుండడంతో ఏపీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మహిళల మార్ఫింగ్ వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో మంగళవారం పర్యటించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మహిళల మార్ఫింగ్ వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని.. మహిళలను కించపరిచే అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మహిళలను అవమానిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. మహిళల మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
'రాజకీయాలకు అతీతంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మహిళలపై అసభ్యకర పోస్టులు చేసే వారిపై నిఘా. మహిళల గౌరవం విషయంలో రాజీ ప్రసక్తే లేదు. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం' అని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్ఫింగ్ కంటెంట్ తయారు చేసి వైరల్ చేసే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళల రక్షణ, గౌరవం కోసం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా మహిళలను ఇబ్బందులకు గురి చేయడం.. వెంటాడడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటివి జరిగే ప్రమాదం ఉండడంతో మహిళలు అప్రమ్తతంగా ఉండాలని రాయపాటి శైలిజ సూచించారు.
అనుమతిలేకుండా మహిళల డీపీలు, ఫొటోలతో నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించడం, వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని దుర్వినియోగం చేసి వేధించడం వంటి చర్యలపై జాగ్రత్తగా ఉండాలని రాయపాటి శైలజ తెలిపారు. సైబర్ నేరాల కోసం 181 మహిళా హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవలు, 1930 సైబర్ నేరాల హెల్ప్‌లైన్‌ను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు మానసిక బలంతో ఉండాలని.. వేధింపులు ఎదురైనప్పుడు భయపడకూడదని చెప్పారు. వేధింపులపై కుటుంబసభ్యులకు చెప్పి వాటి పరిష్కారానికి ప్రయత్నాలు చేయాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం కావని మహిళా చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సూచించారు.