SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Chandrababu naidu: దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం.!.

Arnab effect in Andhra Pradesh: గడచిన ఆరు గంటలుగా తీరంవైపుగా 22 కిలో మీటర్ల వేగంతో అర్నబ్ తుపాన్ కదులుతోందని అధికారుల వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు మాట్లాడి కీలక ఆదేశాలు జారీచేశారు.

Written By Inamdar Paresh
Published: Oct 27, 2026, 03:50 PM IST | Updated: Oct 27, 2026, 04:00 PM IST
Image Credit: chandrababunaidu(file)
Join

CM Chandrababu naidu  review on Arnab cyclone effect: బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ ప్రభావం  వల్ల ఏపీ అతలాకుతలం అవుతుంది. ఈక్రమంలో అర్నాబ్ అతి తీవ్ర తుపాన్ గా మారిన ఏపీవైపుకు దూసుకొని వస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదులుతుందని, వైజాగ్ కు 170 కి.మీ.,బాపట్లకు 350 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., ప్రస్తుతం విశాఖకు 215 కిలో మీటర్ల దూరంలో ,మచిలీపట్నంకు 270 కి.మీ.ల దూరంలో దీని ప్రభావం ఉంది. ఈక్రమంలో ఉత్తరాంధ్రలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. 

అర్నాబ్ తుపాన్ ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబు తుపాన్ ప్రభావిత అన్ని జిల్లాల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అర్నాబ్ ప్రభావంతో.. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, మన్యం, కోనసీమ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా పలు ప్రాంతాల్లో కుండ పోతగా వానలు పడుతాయని ఏపీ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

అర్నబ్ తుపాన్ వేళ.. ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. వివిధ జిల్లాల్లో అర్నబ్ తుపాను ప్రభావం, భారీ వర్షాల స్థితి పై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. 
గడచిన ఆరు గంటలుగా తీరంవైపుగా 22 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని అధికారుల వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆస్తి నష్టం జరక్కుండా చూడాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

ఈదురు గాలుల కారణంగా పడిపోయిన చెట్లు, హోర్డింగులతో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


'అర్నబ్' తుపాను దృష్ట్యా పలు రైళ్లు రద్దు....

అర్నాబ్ ప్రభావం వల్ల ఇప్పటికే 53 రైళ్లు రద్దు అయ్యాయి. ఇక తాజాగా... మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. సికింద్రాబాద్-హౌరా 'ఫలక్‌నుమా' ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ 'విశాఖ' ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ 'గరీబ్‌రథ్' ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.

హైదరాబాద్-విశాఖ 'గోదావరి' ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-కాకినాడ పోర్ట్ 'గౌతమి' ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. లింగంపల్లి-కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రద్దు. మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ రద్దుచేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES