• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

చలికాలం ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు తగినట్టు మనం కూడా మారిపోవాలి. అంటే ప్రధానంగా ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్‌తోపాటు మన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ కూడా మార్చాల్సిందే. లేకపోతే ఈ చలికాలం చర్మం పగులుతుంది. దీంతో ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి. అయితే, మన బామ్మల కాలంనాటి నుంచి పాటిస్తున్న ఈ 5 అద్భుతమైన సీక్రెట్స్‌ పాటిస్తే డబ్బు ఖర్చు లేకుండానే ఇంట్లోనే మృదువైన స్కిన్‌ పొందుతారు. అవేంటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 27, 2026, 04:52 PM IST|Updated: Oct 27, 2026, 04:56 PM IST
joinshare
చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!
Image Credit: Winter Dry Skin Care Remedies:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

2

Akunuri Murali: మీ వద్ద నిబద్దత కన్పించడంలేదు.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆకునూరీ మురళి సంచలన వ్యాఖ్యలు..

3

Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

4

CM Chandrababu naidu: దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం.!.

5

ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Winter Dry Skin Care Remedies: చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పగులుతుంది. ఈ సమస్య అందరినీ వేధిస్తుంది. దీనికోసం మార్కెట్‌లో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసి కెమిల్‌ ఉండే చర్మ  ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, మన బామ్మల కాలంనాటి ఈ చిట్కాలు పాటిస్తే.. మీ డబ్బు ఖర్చు కాకుండా..  ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా లేకుండానే మెరిసే, మృదువైన చర్మాన్ని ఇంట్లోనే పొందుతారు.  ఇది మన చర్మానికి మంచి హైడ్రేషన్‌ అందిస్తాయి. తద్వారా చర్మం పగలదు.. పొట్టు కూడా రాలకుండా ఉంటుంది. వీటితో ఇంట్లోనే పగిలిన చర్మానికి చెక్‌ పెట్టొచ్చు. ఆ చిట్కాలు ఏంటి తెలుసుకుందాం.

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్స్‌ కూడా ప్రభావం చూపుతాయి. కేవలం పై చర్మం రాసే క్రీములు మాత్రమే కాదు. ప్రతిరోజూ మనం తీసుకునే లిక్విడ్స్‌, ఫుడ్‌ కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. అందుకే చలికాలం కూడా కొన్ని ఫుడ్స్ కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా ఈ సీజన్‌లో కూడా మీ చర్మం అందంగా, మృదువుగా కనిపిస్తుంది.

నెయ్యి బెల్లం..
మన చర్మానికి ఈ సీజన్‌లో కచ్చితంగా కావాల్సిన ఖనిజం ఐరన్‌. ఇది బెల్లంలో పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి ఉంటుంది. ఈ సీజన్‌లో మన డైట్‌లో బెల్లం, నెయ్యి చేర్చుకోవాలి. నెయ్యి వల్ల మీ జీర్ణ ఆరోగ్యం కూడా ఈ సీజన్‌లో బాగుంటుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి, బెల్లం రెండూ కలిపి చలికాలంలో తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి సహాయపడుతుంది. తద్వారా తరచూ జలుబు కూడా కాకుండా ఉంటుంది.

నానబెట్టిన బాదం..పాలు..
ఈ చలికాలం మీ చర్మం మృదువుగా కనిపించాలంటే నానబెట్టిన బాదం కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్‌ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. దీంతోపాటు గోరువెచ్చని పాలు కూడా తీసుకోవాలి.  ఇది ఆరోగ్యకరమైన చర్మం పొందడానికి ఒక బెస్ట్‌ ఆప్షన్‌. రోజూ ఈ సీజన్‌లో నానబెట్టి 5 బాదంలు, తొక్కతీసి గోరు వెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. ఇది మీ చర్మం తేమను నిలపడానికి కూడా సహాయపడుతుంది. సహజంగా కూడా మెరిపిస్తుంది. చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

Read Also: దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!
 

తేనె.. ఉసిరి..
సాధరంగా ఇమ్యూనిటీ పెంచితే ఏ సీజన్‌లో అయినా రోగాల బారిన పడకుండా ఉంటారు. విటమిన్‌ సీ పవర్‌హౌస్‌. దీన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ప్రధానంగా తురిమిన ఉసిరిని, తేనెతో కలిపి ప్రతిరోజూ ఒక్క స్కూన్‌ తీసుకోవాలి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. దీంతో మీ చర్మం నూతనుత్తేజంతో కనిపిపిస్తుంది. ఈ రెండిటి కలయిక వల్ల మీ ఇమ్యూనిటీ మెరుగుపడి, చలికాలంలో కూడా మీ చర్మం డల్‌గా మారకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

వేడినీళ్లు.. ఖర్జూరం..
ఇక ఖర్జూంలో కూడా ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. దీంతోపాటు ఇందులో సహజమైన చక్కెరలు లభిస్తాయి. ఇది తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ కూడా ఖర్జూరంతో పొందుతారు. వేడి నీళ్లు, ఖర్జూరం కలిపి తీసుకుంటే మీ జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోజూ రెండు ఖర్జూరాలు తింటే సరిపోతుంది. ఉదయమే గోరువెచ్చని నీరు తీసుకుంటే మీ చర్మానికి మంచి పోషణ అందుతుంది.

బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌..
బీట్‌రూట్‌ రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. క్యారెట్‌లో బీటా కెరోటీన్‌ కూడా లభిస్తుంది. ఈ రెండిటిలో ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. చలికాలంలో కూడా మన చర్మం రావాలంటే  నేచురల్‌ గ్లో పొందుతారు. తాజాగా ఈ రెండిటితో కలిపి జ్యూస్‌ చేసుకోవడం వల్ల గరిష్ట లాభాలు పొందుతారు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Skincare Tips
Home Remedies
Telugu News