Akunuri murali reacts on Khammam Dhanashree incident: ఖమ్మంలోని టేకుల పల్లిలోని అంగన్ వాడీ కేంద్రంలో ఇటీవల ఐదేళ్ల చిన్నారి ధన శ్రీ విషకీటకం కాటు వేయడం వల్ల చనిపోయింది. అంగన్ వాడీ కేంద్రంలో సరైన పారిశుద్ద్య నిర్వాహణ లేక పొవడం, అధికారుల నెగ్లీజెన్సీ ఘటనకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు అంగన్వాడీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఘటనతో అసలు తెలంగాణలోని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు ఎంత వరకు సెఫ్టీగా ఉన్నాయన్నదానిపై చాలా మంది తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేశారు. తరచుగా హస్టళ్లలో నాణ్యతలేని ఆహర పదార్థాల్ని సైతం సరఫరా చేస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చిన్నారి ధన శ్రీ ఘటనపై రిటైర్డు ఐపీఎస్ ఆకునూరీ మురళి ఎక్స్ వేదికగాభావొద్వేగంతో ట్విట్ చేశారు.
సారీ తల్లీ ధనశ్రీ . నిన్ను ఈ ప్రపంచానికి దూరం చేసుకున్నాము. అన్నీ బడులలో సౌకర్యాలతో కూడిన మంచి ప్రీప్రైమరీ తరగతులు, గదులు ఉండి ఉంటే నువ్వు బ్రతికేదానివంటూ ట్విట్ చేశారు. విద్యా కమిషన్ సిఫార్సుల ప్రకారం నర్సరీ, LKg, UKg లతో కూడిన తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దయచేసి అందరూ పిల్లలకు సరిపడా ఈ బడులు నిర్మించాలని, 5 సం ప్రణాళిక తయారు చెయ్యాలని.. ఏదో మొక్కుబడిగా సౌకర్యాలు లేని కొన్ని ప్రీప్రైమరీ బడులు పెట్టి చేతులు దులుపుకోవద్ది కాంగ్రెస్ ప్రభుత్వంకు చురకలు పెట్టారు. 60 లక్షల మంది బడి పిల్లలకు సంబంధించిన తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ను, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను అభివృద్ధి చెయ్యాలని, స్కూల్ బస్సులు పెట్టాలని, బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా.. పిల్లలే మనకు ప్రాధాన్యత అని.. కానీ మీ దగ్గర ఆ నిబద్ధత కనపడడం లేదు CM గారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శనాస్త్రాల్ని సంధించారు. మరోవైపు.. అంగన్ వాడీ ఘటనపై ఖమ్మంలో స్థానికంగా తీవ్ర వివాదం రాజుకుంది.
టీచర్లు, సిబ్బంది నెగ్లీజెన్సీ వల్లనే చిన్నారి మృతి చెందిందని స్థానికులు ఆరోపించారు. అంగన్వాడి సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆకునూరీ మురళి చేసిన ట్విట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.