SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YS Jagan: ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

YS Jagan Slams To Chandrababu And Election Commission: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అరాచకాలు.. దాడులు, హింస చెలరేగడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 03:36 PM IST | Updated: Oct 18, 2026, 03:39 PM IST
Image Credit: YS Jagan Press Meet
Join

AP Election Riots: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రణరంగం నడుస్తోంది. నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పోటీలో లేకుండా చేసేందుకు నామినేషన్లు వేయకుండా దాడులు, హింస, అల్లర్లు చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ సక్రమంగా లేదని.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

'కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న దాడులపై ఎన్నికల సంఘం కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠాకు అన్ని ఆధారాలు ఇచ్చాం. ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ వేసే పరిస్థితి లేదు. నామినేషన్ వేయలేదు అనే పరిస్థితి వస్తే ఎన్నికల సంఘం పరువు పోతుందని చెప్పా. ఎస్పీ ఎస్కార్ట్ ఇచ్చి నామినేషన్  వేయాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం వైఎస్‌ జగన్‌ వివరించారు. నామినేషన్లు వేయలేని చోట అవసరం అయితే సమయం పెంచాలని అడిగామని తెలిపారు.

'అప్పిరెడ్డి స్వయంగా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు బాధ్యతలు చూస్తారు. గురజాలలో చైర్‌పర్సన్ అభ్యర్థులను పోలీసులు తీసుకొని వెళ్లారు. తీసుకెళ్లిన మా అభ్యర్థులను వెనక్కు తీసుకొని రావాలని చెప్పాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరాం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరుపై వివరించినట్లు పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికల్లో దాడులపై గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కేంద్ర బలగాలు తీసుకురావాలని చెప్పానని.. పోలింగ్ బూత్ బయట లోపల లైవ్ అప్డేట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మీద తమకు నమ్మకం లేదని.. బ్యాలెట్ బాక్సులు ఉండే చోట స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రజలు అందరూ 17సీ ఫామ్ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'ఎన్నికల సంఘానికి వరుసగా రెండు వారాలుగా విన్నవిస్తూనే ఉన్నాం. మేము చెప్పింది ఎన్నికల సంఘం కమిషనర్‌ తల ఊపాడు. ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. లేదంటే ఇవన్నీ జరగవు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే అర్థమవుతోంది పారదర్శకంగా ఉన్నాడా లేదా అనేది అని సందేహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ బాహాటంగానే వాచ్‌మెన్‌లాగా తయారైందని ఆరోపించారు. ఐజీ, ఎస్పీలు, డీఎస్పీలు ఒక మాఫియాలాగా తయారయ్యారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు.

'రెండేళ్లు దాటిన ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులు ఎమ్మెల్యేలతో చేతులు కలిపి నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ మాటలు వింటుంటే వృత్తి ధర్మాన్ని మర్చిపోయినట్లు అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు జరగడానికి బయటపడుతుంది?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా ఎందుకు అడ్డుకుంటుందని నిలదీశారు.అనూహ్యమైన ఫలితాలు వస్తాయనే చంద్రబాబు ప్రభుత్వం బయటపడుతుందని తెలిపారు.

'బాండ్లు ఇచ్చి ఓట్లు అడిగారు ఇప్పుడు నిలదీసి ప్రజలు అడుగుతారని ప్రభుత్వం భయపడుతుంది. కూటమి పాలనపై రైతులు, మహిళలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోయ ప్రవీణ్ లాంటి కొంతమంది అధికారులను పావులుగా పెట్టుకొని చంద్రబాబు ఇదంతా నడిపిస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES