Bheemili kgbv Girl Hair Cut Row: రాత్రి నిద్రలో బాలికల జడలు కట్..!.. కేజీబీవీ స్కూల్ సందర్శించిన మాజీ మంత్రి ..
Girls hair cut row in bheemili kgbv school: భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆరాతీశారు.దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.
Former minister ganta Srinivas rao visits Bheemili kgbv school: ఆంధ్ర ప్రదేశ్ లోని భీమిలిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో ఇటీవల బాలిక విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి పూట నిద్రలో ఉన్న కొంత మంది బాలికల జుట్టును కట్ చేయడం తీవ్ర దుమారంగా మారింది. సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత విద్యార్థినులు నిద్రపోయారు.
మరుసటి రోజు ఉదయం చూడగా.. 20 మంది విద్యార్థులు నిద్రించిన గదిలో ఆరుగురికి, 18 మంది నిద్రించిన గదిలో నలుగురు విద్యార్థులకు జడలు కత్తించి ఉంది.ఉదయం బాలికలు ఈవిషయాన్ని వసతి గృహంలో సిబ్బందికి తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
దీనిపై ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తాజాగా.. మాజీ మంత్రి గంట శ్రీనివాస్ రావు భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంను సందర్శించారు. విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై వసతి గృహం సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించాలన్నారు.
బైట నుంచి ఎవరైన వచ్చారా..?.. ఎవరైన ఆకతాయిలు ఈ పనిచేశారో తెలుసుకొవాలన్నారు. రాత్రి సమయంలో విద్యార్థినులు ఉన్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు..?.. బాలికల భద్రతకు సంబంధించిన పర్యవేక్షణలో ఏమైనా లోపాలు జరిగాయా..?.. అన్న కోణంలో విచారించాలని గంటా శ్రీనివాస్ సూచించారు.