SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

RK Roja: రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సీమలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది: ఆర్‌కే రోజా

RK Roja Slams To Chandrababu: రాయలసీమ ద్రోహి అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి పాలుతాగి రొమ్ముగుద్దినట్లు సీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సీమలో పుట్టినందుకు సిగ్గుగా ఉందని ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 03:58 PM IST | Updated: Oct 07, 2026, 04:03 PM IST
Image Credit: RK Roja
Join

Rayalaseema Development: 'రాయలసీమకు వైఎస్సార్ కుటుంబం వరం అయితే. చంద్రబాబు కుటుంబం ఒక శాపం' అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. రైజింగ్ రాయలసీమ పేరుతో పబ్లిసిటీ స్టంట్ మొదలుపెట్టారని విమర్శించారు. 'నారా నట సామ్రాట్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ఈవీఎంలు దయతో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులు అయ్యారు. బ్యాలెట్ బాక్స్‌లు మేనేజ్ చేయలేరు కాబట్టి భయపడుతున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు, తల్లి పాలుతాగి రొమ్ముగుద్దినట్లు సీమకు అన్యాయం చేస్తున్నారు' అని మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

చిత్తూరులో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆర్‌కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాయలసీమకు దరిద్రం పట్టుకుంది. 388 కరువు మండలాలు తీవ్రమైన కరువు రాయలసీమ జిల్లాల్లోనే ఉంది. రైతులు ఆత్మహత్యలు, వలస కూలీలు రాయలసీమలోనే అత్యధికంగా ఉన్నాయి. రాయలసీమ ప్రజలకు నట్టేట ముంచారు. ఈ ప్రాంతంలో పుట్టి మోసానికి సిద్ధమవుతున్నారు' అని కూటమి పాలనపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శలు చేశారు. 'రూ.లక్ష కోట్ల హార్టీ కల్చర్ పేరుతో మోసం చేస్తున్నారు. కరువు మండలాలు జాబితా కేంద్రానికి పంపలేదు. రైతు కుటుంబంలో పుట్టి రైతులను మోసం చేశాడు' అని చంద్రబాబుపై మండిపడ్డారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న సీఎం చంద్రబాబు ఆస్తులు, డిప్యూటీ సీఎం ఆస్తులు కాపాడుకోవడానికి రాయలసీమ ప్రాజెక్టు తాకట్టు పెట్టారు. నీకు దమ్ము ఉందా రాయలసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ప్రకటించు చూద్దాం..!' అని చంద్రబాబుకు మాజీ మంత్రి ఆర్‌కే రోజా సవాల్‌ చేశారు. రాయలసీమలో నువ్వు పుట్టిందుకు తమకు సిగ్గుగా ఉందని ప్రకటించారు. రాయలసీమ ప్రజల కరువు, ఆకలితో అలమటిస్తున్నా అమరావతి ముఖ్యం అంటూ.. రాయలసీమ ప్రాంతంలో కట్టిన పన్నులు డబ్బు అమరావతి బురదలో పోస్తున్నారని కూటమి పాలనపై రోజా మండిపడ్డారు.

'వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి నేర్చుకోండి. రెండేళ్లు కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఎలా ఆదుకున్నారు చూడండి' అని కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే రోజా సూచించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో చెప్పండి? అని సవాల్ విసిరారు. 'స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టడానికి చంద్రబాబు చూస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు పోటీ పడుతున్నారు. కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వలేని వీళ్లు పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కుప్పానికి నాలుగు దశాబ్దాలుగా ఉండి నీళ్లు ఇవ్వలేక పోయావు. వైఎస్‌ జగన్‌ దయతో కృష్ణా జలాలు కుప్పానికి తీసుకువచ్చారు' అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

'మద్యం కుంభకోణం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారు. లిక్కర్ స్కాం కాదు. లిక్కర్ పాలసీలో భాగంగా ఖజానాకు నగదు బదిలీ అయ్యింది' అని మాజీ ఎమ్మెల్యే రోజా వివరించారు. 2014-19 వరకు రాష్ట్రంలో అతిపెద్ద మద్యం కుంభకోణం జరిగింది. ప్రస్తుతం 2024 నుంచి ఇప్పుడు మరల జరుగుతోంది. టీడీపీ నాయకుల నుంచి ముడుపులు తీసుకుని మద్యం షాపులు, పర్మిట్ రూమ్‌లు నడిపిస్తున్నది నువ్వు కాదా?' అని అని ప్రశ్నించారు. '43 వేల బెల్ట్ షాపులు మేము తీసివేస్తే మీరు కొనసాగిస్తున్నారు. మీరు చేస్తున్నది అతిపెద్ద లిక్కర్ స్కాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తాం' అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు రోజా ప్రకటించారు. వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను తీసుకువచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద చల్లుతున్నారని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES