SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Heavy rains In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ఛత్తీస్‌ఘడ్‌కు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, చంపాకు దక్షిణ నైరుతిగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 07:53 AM IST | Updated: Sep 26, 2026, 08:52 AM IST
Image Credit: AP Rain Effect (ZEE News Telugu/Source)
Join

AP Rains Due to Low Pressure: వాయుగుండం బలపడటం మూలానా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్రతను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 12 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో నైరుతి, పశ్చిమ దిశగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్‌ ఉందన్నారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల నేపథ్యంలో రైతులు వర్షం పడేటపుడు పిడుగులు పడే ప్రమాదం  పంట పొలాల్లో ఎలాంటి పనులు చేయవద్దని అధికారులు చెబుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో ష్లాష్ ఫ్లడ్స్..

తీవ్ర వాయుగుండంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల ఫ్లాష్ బడ్స్ సంభవించాయి. అనపర్తి మండలంలోని పలు గ్రామాలు ఆకస్మిక వరదలతో ముంపుకు గురయ్యాయి. గ్రామాల్లోని వీధులన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులకు ఆహార పంపిణీ చేపట్టి  వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వర్షాలు... వరద పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే తెలిపారు.


నీట మునిగిన పిఠాపురం.. 
వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా వర్షాల కారణంగా కాకినాడ జిల్లా  పిఠాపురం నీటమునిగింది. పి.తిమ్మాపురం, వెల్దుర్తి, పి.రాయవరం గ్రామాలలో వందల ఎకరాలు పంట పొలాలు నీటి మునిగి, చెరువులను తలపిస్తున్నాయి. సుమారు 400 ఎకరాలు నీట మునిగిన పంట పొలాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులను ఆదుకోవాలని కోరారు. పి తిమ్మాపురం గ్రామంలో కొత్త కాలనీ, అంగన్ వాడి కేంద్రం  నీటి మునిగి పోయాయి. అల్పపీడనం వర్షం కారణంగా పి.రాయవరం నుంచి ధర్మవరం వరకు రోడ్డుపై వరద నీరు చేరి ప్రవహిస్తుడడంతో  రాయవరం రహదారిపై గోతులు పడ్డాయి. నీరు నిలవ ఉండటంతో ప్రయాణికుల రాకపోకలకు, ఆసుపత్రులకు వెళుతున్న గర్భిణీలు తీవ్రమైన ఇబ్బందులు గురువుతున్నారు.

శ్రీకాకుళంలో భారీ వర్షాలు..

శ్రీకాకుళం జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి, వంశధార, బహుద నదులకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నాగావళికి ఇన్ ఫ్లో 59 వేల 7 వందల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వంశధార నదికి ఇన్ ఫ్లో 41 వేల 4 వందల క్యూసెక్కుల నీరు వస్తుండగా 42 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బహద నదికి 34 వేల 6 వందల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ వర్షాలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. లోతట్లు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని రణస్థలం మండలం నుంచి కవిటి మండలం వరకు ముప్పై మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి.. తీర ప్రాంత మండలాల్లో గ్రామాలకు వాయుగుండం ప్రభావం భాగానే పడింది.. గార, పోలాకి, రణస్థలం, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు, సోంపేట, కవిటి మండలాల్లో పంటలు నీటి ముంపుకు గురయ్యాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES