SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pulivenduala: కడప, పులివెందుల పోలింగ్ కేంద్రాల వద్ద హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల తోపులాట.!.. భారీగా బలగాల మోహరింపు..

Andhra pradesh local body polling: పులివెందులలో అర్ధరాత్రి 8 వాహనాలకు గుర్తు తెలియని దుండదలు నిప్పంటించారు. మరోవైపు ఈ ఘటనతో కడపలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాల్ని మోహరించారు.

Written By Inamdar Paresh
Published: Nov 01, 2026, 07:35 AM IST | Updated: Nov 01, 2026, 07:48 AM IST
Image Credit: ys jagan (file)
Join

High tension at Pulivendula election polling centre: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులి వెందులలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది.  నిన్న అర్ధరాత్రి పులి వెందులలోని  శిల్పారామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పలు వాహనాలకు నిప్పంటించారు.  ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి పొలంలోని నివాసం వద్ద నిలిపి ఉంచిన బైకులు, కార్లు, ట్రాక్టర్ ట్రాలీకి నిప్పు పెట్టారు.. సుమారు 8 వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం. ఈ  ఘటనలో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఈ ఘటనతో పోలీసులు అదనపు బలగాల్ని రప్పించారు. కూటమి,వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకొవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. 

 

అయితే... కాసేటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. తమను పోలింగ్ కేంద్రాలకు పంపించడంలేదని వైసీపీ ఏజెంట్ లు నిరసనలు దిగారు. పోలీసులు తమను ఉద్దేష పూర్వకంగా పోలీంగ్ కేంద్రాలకు అనుమతించడంలేదని వాపోతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వైసీపీ ఏజెంట్లు రాకుండా, ఓటర్లు రాకుండా చేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఓట్లు వేయించడానికి అన్ని వ్యవస్థల సహకారంతో  టీడీపీ రెచ్చిపోతుందని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. 

మరోవైపు పులివెందుల మున్సిపాలిటీ 18 వార్డులో యర్రగుడి పల్లి వద్ద వైసీపీ,టీడీపీ వర్గీయుల మధ్య భారీ తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పి  చెదరగొట్టారు.  కడప జిల్లా కాగితాల పెంటలో ఏజెంట్ర పత్రాలపై ఉన్న ఫోటోల్ని గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడంతో గందర గోళం నెలకొంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల మధ్య పలు కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రారంభమైంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES