Vijayawada kanaka durga Temple: కనక దుర్గమ్మ దర్శనాలకు పొటెత్తిన భక్తులు.. తొలిరోజే ఏర్పాట్లపై ఆగ్రహం..
Heavy rush in indrakeeladri: ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అయతే.. తొలిరోజే విజయవాడకు భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది.
Huge rush in Vijayawada indrakeeladri temple: దేశ వ్యాప్తంగా దుర్గశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మతల్లిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల వారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీగా తరలి వస్తారు.ఈ క్రమంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు ఇంద్రకీలద్రిపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఈ రోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్ని రకాల స్పెషల్ టికెట్లు రద్దు చేశారు.
సామాన్య భక్తులకు దర్శనాలు అయ్యేలా దుర్గమ్మ గుడి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముఖ్యంగా దుర్గమ్మ గుడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
తొలిరోజే భక్తుల అవస్థలు..
విజయవాడలో తొలిరోజే భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. మూడు లైన్లలో ఉచిత దర్శనం, సామాన్యులకే పెద్దపీట అంటూ అధికారులు ప్రచారం చేశారని... కానీ వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు పెద్దపీట వేస్తున్నారంటూ భక్తులు తీవ్ర విమర్శలు చేశారు.
గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడినట్లు తమ గొడును చెప్పుకున్నారు. అసలు ఎవరు భక్తులకు సరైన రెస్పాన్స్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.