SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

APకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న తీవ్ర తుపాను.. పక్క రాష్ట్రాల సాయం కోరిన బాబు..

IMD Big Alert: నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం, నిన్న మురాసు తుపానుగా బలపడింది. గంటకు 27 కి.మీ. వేగంతో కదులుతూ చెన్నైకి 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 08:32 AM IST | Updated: Nov 02, 2026, 08:37 AM IST
Image Credit: Toofan Effect (ZEE News Telugu/Source)
Join

Murasu Effect On AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది.  నేటి ఉదయానికి అది తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయవ్య దిశగా ప్రయాణించి నేటి అర్ధరాత్రి లేదా రేపు  తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అవకాశం ఉందని తెలిపింది.

నెల్లూరు-నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం..

ఇది నెల్లూరు, నరసాపురం మధ్యలో తీరం దాటుతూ ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలపై  ప్రభావం చూపనుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ మీదుగా మహారాష్ట్ర వైపు పయనిస్తుందని, అదే సమయంలో తుపాను  బలహీన పడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.  

తీవ్ర తుపాను కారణంగా APలో 3 రోజులు అతి భారీ వర్షాలు..

తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంట గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది. ఈ రోజు   కృష్ణా, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా ఏపీలో కోస్తా తీరం వెంబడి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

విద్యుత్ పునరుద్ధరన పనులపై సీఎం  సమీక్ష..

మురసు తుఫాను నేపథ్యంలో  విద్యుత్ శాఖ సన్నద్దతపై సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష  నిర్వహించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 6 వేల నుంచి 8 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బ తిన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.  విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం నేపథ్యంలో అధికారులు ఎప్పటికపుడు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతూ విద్యుత్‌ను పునరుద్దరిస్తున్నారు. 
అవసరమైన సిబ్బంది, సామగ్రి ముందే తరలించాలని సూచించారు.  అర్నబ్ తుఫాను సవాళ్లను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి.  అంతేకాదు విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి విద్యుత్ పనుల నిమిత్తం సిబ్బందిని పంపించాలని కోరారు. మురాసు (Murasu) అనే తుపాను పేరు సూచించిన భారత్. దీని అర్ధం యుద్ధ భేరి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES