AP Cyclone Alert: ఈ రోజు వాయుగుండంగా మారి మరింత బలపడి తుఫాన్ గా మారనుంది. మురుసు తుఫాన్ నవంబర్ 2న తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్టు సమాచారం.
ఏలూరు, NTR, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని బిగ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పు గోదావరి, అన్నమయ్య, నంద్యాల, కోనసీమ, చిత్తూరు, ,కడపలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మురుసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇది చెన్నైకు ఆగ్రేయ తూర్పు దిశగా 960 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్‌కు ఆగ్నేయ దిశగా 980 కిలో మీటర్ల దూరంలో.. మచిలీ పట్నానికి 1030 కిలో మీటర్ల దూరంలో.. ఒంగోలుకు ఆగ్నేయ తూర్పు దిశగా 1080 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తీరాన్ని దాటే అవకాశం:
నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీరాన్ని దాటే అవకాశం ఉంది. అదే రోజు ఉదయం నెల్లూరు - నరసాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది.
తీరాన్ని దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 100–110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, ఈదురు గాలుల వేగం గంటకు 120 కి.మీ. వరకు ఉండవచ్చు. ఇప్పటికే అర్నాబ్ తుపానుతో అల్లోకల్లోమైన ఆంధ్ర ప్రదేశ్ ఇపుడు మురాసు తుపానుతో ఏ మేరకు నష్టం వాటిల్లనుందో చూడాలి. ఇది ఎక్కువగా గుంటూరు, నెల్లూరు మధ్య ఎక్కువగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.