Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ పొందిన మాజీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రిటైర్డ్ పొందిన ఉద్యోగులకు సంబంధించిన పింఛన్‌ను భారీగా పెంచుతూ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛన్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయస్సు పైబడడం.. అనారోగ్యంతో బాధపడే పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం తాజాగా పెంచిన ఫించన్‌పై భారీ ప్రయోజనం కలగనుంది.
పింఛన్ పెంపు అనేది అందరూ పింఛన్‌దారులకు కాదు. 70 ఏళ్లు దాటిన ప్రభుత్వ పెన్షర్లకు పింఛన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 70 ఏళ్లు పైబడిన పింఛన్‌దారులకు ఇచ్చే ఫించన్‌ను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వయస్సు పైబడిన పింఛన్‌దారులకు ఆర్థికంగా మరింత ఊరట అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మానవత్వ దృక్పథంతో పింఛన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ పింఛన్ పెంపునకు సంబంధించి ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెంబర్-126ను మంగళవారం విడుదల చేసింది.
70 సంవత్సరాలు నిండిన సాధారణ పెన్షనర్లకు, ఫ్యామిలీ పింఛన్‌దారులకు ఇప్పటివరకు అదనంగా ఏడు శాతం చెల్లిస్తున్నారు. ఈ అదనపు పెన్షన్‌ను ఇప్పుడు 10 శాతానికి పెంచారు. 75 ఏళ్లు నిండిన వయోవృద్దులకు అదనపు పెన్షన్‌ను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెన్షన్లను ప్రభుత్వం కొత్త సంవత్సరం అంటే 1వ తేదీ జనవరి 2027 నుంచి చెల్లించబోతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పింఛన్‌దారులు జనవరి నెల నుంచి పెరిగిన పింఛన్ మొత్తాన్ని పొందుతారు.
అయితే 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పింఛన్‌దారులకు మాత్రం ప్రభుత్వం శుభవార్త వినిపించలేదు. వారికి అదనపు పెన్షన్ శాతంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. వారికి ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారమే పెన్షన్ అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ అదనపు పింఛన్ రేట్లను పెంచాలని చాలా కాలంగా ఏపీ పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. వారి విజ్ఞప్తులు, డిమాండ్‌లను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం పింఛన్ పెంపుపై శుభవార్త వినిపించడంతో పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్యామిలీ ఫించన్‌దారులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. పింఛన్‌దారుల సంఘాలు ప్రభుత్వ ప్రకటనను స్వాగతించి.. హర్షం వ్యక్తం చేశాయి. ఫించన్ల పెంపుతో తమకు ఆర్థికంగా మరింత ఆసరాగా నిలుస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు.
మినహాయింపులు
అయితే పింఛన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు మాత్రం వర్తించవు.
వృద్ధాప్య ఫించన్లు/ ఎన్టీఆర్ భరోసా లాంటి సామాజిక ఫించన్లు అందుకునే వారికి ఈ పెంపు వర్తించదు
రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబంలోని పెన్షనర్లకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.