• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 సహా 1,466 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలివే!

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 సహా 1,466 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలివే!

Job Notification: ఏపీ సర్కార్ పలు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్స్ జారీ చేసింది. 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అదే కాదు మరో 1,466 ఉద్యోగాల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్స్ కూడా జారీ చేసింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 14, 2026, 09:39 AM IST|Updated: Oct 14, 2026, 09:41 AM IST
joinshare
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 సహా 1,466 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలివే!
Image Credit: Job Notification

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సర్కారు బడికి కళొచ్చింది.. అల్పాహారంతో 22శాతం పెరిగిన హాజరు.. బడి పిల్లలకు అత్యంత ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా?

సర్కారు బడికి కళొచ్చింది.. అల్పాహారంతో 22శాతం పెరిగిన హాజరు.. బడి పిల్లలకు అత్యంత ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా?

2

Robot Row in Germany: జర్మనీలో షాకింగ్ .. యువతి ప్రైవేటు పార్ట్‌లు టచ్ చేస్తు రోబోట్ పాడుపని.. వీడియో వైరల్..

3

Dussehra 2026: దసరా వేళ శుక్రమూఢమి, మంగళవారం గండం.. కొత్త వాహనాలు కొనకూడదా..?..

4

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 సహా 1,466 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలివే!

5

Russian Woman: ఇది కదా నిజమైన ప్రేమ... బీహర్ ప్రియుడి కోసం రష్యా నుంచి యువతి.. గుడిసెలోనే ఉంటానని రచ్చ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Job Notification: ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్  చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత ఏడాది జాబ్ క్యాలెండర్ లో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే పలు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు సైతం జారీ చేసింది. 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేకాదు మరో 1466 ఉద్యోగాల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. దీనిలో భాగంగా గ్రూప్ 2లో 686 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ నవంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.  అనంతరం  షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులు ఉంటాయి. గ్రూప్ 2 ఉద్యోగాలకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన రిజర్వేషన్లు, విద్యా అర్హతలతోపాటు ఇతర వివరాలను పూర్తిస్థాయిలో త్వరలోనే విడుదల చేయనుంది.

>> గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ - 6 పోస్టులు

>> గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్ - 7 పోస్టులు

>> డిప్యూటీ తహసీల్దార్‌ - 200 పోస్టులు

>> జీఎస్టీ ఆఫీసర్‌ (ఏసీటీవో) - 40 పోస్టులు

>> సహకార శాఖలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ - 10 పోస్టులు

>> డిప్యూటీ మండల పరిషత్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ (ఎంపీడీవో)- 176 పోస్టులు

>> ఎక్సైజ్‌ ఎస్‌ఐ - 29 పోస్టులు

>> జీఏడీ ఏఎస్‌వో - 71 పోస్టులు

>> ఆర్థిక శాఖ ఏఎస్‌వో - 5 పోస్టులు

>> న్యాయశాఖ ఏఎస్‌వో - 4 పోస్టులు

>> ట్రెజరీలో సీనియర్‌ అకౌంటెంట్‌ - 90 పోస్టులు

>> ట్రైజరీలో జూనియర్‌ అకౌంటెంట్‌ - 48 పోస్టులు

ఇతర ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు :

>> వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు - 503 (నవంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> దేవదాయశాఖలో డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు - 6 (నవంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> దేవదాయశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు - 5 (నవంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు - 1 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> గనుల శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు - 36 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> గనుల శాఖలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు- 9 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> గనుల శాఖలో ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టు -1 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌ పోస్టులు - 9 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు - 50 (నవంబర్ 6 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> డైట్‌ లెక్చరర్‌ పోస్టులు - 104 (నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్‌ పోస్టులు - 10 (నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ)

>> డైట్‌ సీనియర్‌ లెక్చరర్‌ పోస్టులు - 46 (నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది)

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Govt Jobs
Telugu News
AP News