Shukra Moudyami effect on Dussehra religious celebrations: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని ఎంతో పవిత్రంగా ప్రతిష్టాపనలు చేయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దుర్గమ్మ తల్లి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో భక్తులను అనుగ్రహిస్తారు. అయితే ఈసారి మనకు దసరా వేళ శుక్రమౌఢ్యమితో పాటు మంగళవారం గండం కూడా తెగ ఇబ్బందిగా మారిందని చెప్పుకొవచ్చు.
పంచాంగాల ప్రకారం 2026 అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 30 వరకు శుక్ర మూఢమి కాలం ఉంటుంది. దసరా పండుగ అక్టోబర్ 20, 21 తేదీల్లో వస్తుండటంతో భక్తులు కొంత మంది తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు.
దసరా రోజునచాలామంది ప్రతి ఏటా కొత్త వాహనాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్తపనులు ప్రారంభిస్తారు. ఈ రోజు శ్రీరాముడు రాజ్యంను తిరిగి సాధించారని, అమ్మవారు మహిషా సురుడ్ని హతమార్చారని.. చెడుపై మంచి గెలిచినందుకు ప్రతీకగా దసరా పండగను మనం జరుపుకుంటాం. కానీ శుక్రమూఢమి వల్ల ఈరోజుల్లో కొత్త వాహనాలు చేయడం, కొత్త పనులుచేయోద్దని పండితులు చెబుతున్నారు.
శుక్రుడు లగ్జరీస్ కు, సౌందర్యానికి కారకుడు. ఈ గ్రహం పడమర నుంచి తూర్పుకు రావడం వల్ల సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల తన శక్తిని కొల్పోయి,చీకటిగా మారుతాడు. దీంతో ఈ కాలంలో మౌఢ్యమి ( చీకటి కాలం) ఏర్పడుతుంది.
అందుకే ఈ శుక్రమౌఢ్యమి వేళ కొత్త వాహనాలు, కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు చేరకపొవడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదే విధంగా మంగళ వారం రోజున దసరా రావడంతో దీన్ని కూడా చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. అందుకే ఈసారి దసరా పండగ వేళకొత్తపనులు చేయోద్దని పండితులు సూచిస్తున్నారు.
మూఢమి వేళ ఏమిచేయాలి..?.
దసరావేళ దేవతా పూజ, ఆరాధన, శాంతులు మొదలైనవి చేసుకొవచ్చు. అదే విధంగా నదీస్నానం కూడా మంచిదని చెప్తుంటారు.
మూఢమి రోజు ఏమిచేయకూడదు..?..
ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఎలాంటి శుభకార్యాలైన కూడా వాయిదా వేసుకొవడం మంచిదనిజ్యోతిష్య పండితులు చెబుతున్నారు.