SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాకినాడ, ఏలూరులను ముంచెత్తిన వానలు.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 04:03 PM IST | Updated: Sep 26, 2026, 04:08 PM IST
Image Credit: AP Rains effect (ZEE Telugu /Source)
Join

Rain Effects Areas: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏర్పడిన తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భీకర వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు వంకలతో పాటు గ్రామాలకు గ్రామాలు నీటితో మునిగి పొంగిపొర్లుతున్నాయి.

కాకినాడ నగరంలో ఉప్పుటేరు పొంగి కాలనీలు నీటిలో ఉండిపోయాయి. నగర కమిషనర్ ద్విచక్ర వాహనంపై వెళ్లి అల్పాహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇక నగరం, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా మోకాలు లోతు నీటిలో ఇళ్ళు కనిపిస్తున్నాయి.

ఎక్కడ చూసినా తుఫాను బాధితులే కనిపిస్తున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కాకినాడ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.  

ఏలూరులో వర్షాలు.. 

మరోవైపు ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి వరద ప్రవాహం తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఇన్‌ఫ్లో భారీగా రావడంతో నీటి మట్టం పెరిగింది.  దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ఏకంగా 5 లక్షల 36 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

లంక గ్రామాల మునక..

గోదావరికి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాలు, తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, అలాగే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES