Andhra Pradesh: ద్యావుడా.. అప్పు ఎగ్గొట్టి.. ఏకంగా అమ్మోరు తల్లికే IP నోటీసులు.. ఏపీలో వింత ఘటన.!.
Man sends ip notice to temple: ఆలయ కమిటీకి చెల్లించాల్సిన రూ.3 లక్షల బకాయితో పాటు మొత్తం 56 మంది నుంచి తీసుకున్న సుమారు రూ.1.65 కోట్ల అప్పులు తీర్చలేనని పేర్కొంటూ రుణదాతలకు ఏపీలోని తాడిపత్రికి చెందిన వ్యక్తి ఐపీ నోటీసులు పంపడం స్థానికంగా దుమారంగా మారింది.
Man sends Insolvency Petition notice to tadipatri temple: సాధారణంగా మనలో చాలా మంది తమ అవసరాల కోసం బంధువులు, స్నేహితులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వివిధ రూపాల్లో డబ్బులను అప్పుగా తీసుకుంటారు. కొంత మంది ప్రతినెల ఇంట్రెస్ట్ లను చెల్లిస్తారు. మరికొంత మంది మాత్రం ఒకేసారి చెల్లించేలా అగ్రిమెంట్ ను మాట్లాడుకుంటారు. ఇదంత మనం చూస్తుంటాం.ఈ క్రమంలో అప్పులు తీసుకున్న వారు కొంత మంది అనుకొనివిధంగా ఏదైన సమస్యలు ఎదురైతే లేదా అనుకొని ఇబ్బందులలో పడితే వారు రుణ గ్రహితలకు ఐపీ నోటీసులను పంపుతారు.
తాను అసలు అప్పు తీర్చేవిధంగా లేనని ఐపీలు పెట్టడం మనం తరచుగా చూస్తుంటాం.ఈ క్రమంలో ఏపీలోని తాడిపత్రిలోని యాడికి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పులు తీర్చలేనంటూ మాయకుంట్ల మోహన్ అనే వ్యక్తి ఏకంగా చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీకి ఐపీ నోటీసు పంపాడు. ఈ ఘటన స్థానికంగా రచ్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంజిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో మాయకుంట్ల మోహన్ అనే వ్యక్తి చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ నుంచి రూ.3 లక్షలు, అదే విధంగా మరో 56 మందినుంచి ఏకంగా 1.65 కోట్ల అప్పులు చేశాడు.
తాజాగా తాను తీసుకున్న అప్పును చెల్లించలేనని 56 మంది రుణదాతలతో పాటు, అమ్మవారి ఆలయంకు సైతం ఐపీ నోటీసులు పంపాడు. దీంతో ఆలయ కమిటీ ఈ నోటీసులు చూసి ఖంగుతిన్నారు. అసలు అమ్మవారి ఆలయంకు ఐపీ నోటీసులు ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.