Nara lokesh: గొర్రెల కాపరిగా బాలుడు.. ఎక్స్ వేదికగా శుభవార్త చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేష్.!..
Boy working as shepherd in prakasam: బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన బాలుడి ఘటనపై మంత్రి నారాలోకేష్ రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా అతడికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు.
Minister nara Lokesh responds on shepherd boy ramayya incident: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుంది. ఒకవైపు ఎన్నికలలో ఇచ్చిన పథకాలను అమలు చేస్తునే మరోవైపు అపోసిషన్ పార్టీలకు చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి నారాలోకేష్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై ట్విటర్ వేదికగా స్పందిస్తారు.
అపోసిషన్ పార్టీలకు కూడా ట్విట్ రూపంలో కౌంటర్లు ఇస్తారు. అయితే.. ఇటీవల ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర 8 ఏళ్ల వయసున్న రామయ్య అనే బాలుడు గొర్రెలను కాస్తు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని వీడియో తెగ వైరల్ గా మారింది.
బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడ్డాడు. ఈ క్రమంలో బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఉందని చెప్పాడు. తనకు ఇక్కడ గొర్రెలు మేపుతున్న కూడా అన్నం కూడా పెట్టడంలేదని వాపోయాడు. దీంతో కొంత మంది బాలుడి అవస్థలు చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ కు, ఏపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
బాలుడు రామయ్య ఘటన చూసి చాలా ఆవేదన కల్గించిందని చెప్పారు. అంతే కాకుండా ప్రకాశం జిల్లా అధికారులను ఆ బాలుడిని గుర్తించి, అతనికి సరైన విద్యాభ్యాసం, వసతులు, కల్పించాలని ఆదేశించినట్లు తెలిపాడు. ఆ బాలుడికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో బాలుడి కష్టాలను తన వరకు తీసుకొచ్చిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరికి మంచి విద్యా, పథకాలు, అన్ని రకాల సదుపాయాలు అందేలా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని మంత్రి నారాలోకేష్ తెల్చి చెప్పారు.