• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!

మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దిండు తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే పడుకోవడం కష్టమవుతుంది. అయితే ప్రతిరోజూ దిండుపై పడుకోవడం వల్ల, ముఖం నుండి వచ్చే ఫేషియల్ ఆయిల్స్, జుట్టులోని నూనె ఇతర దుమ్ము ధూళి కారణంగా దిండుపై పచ్చని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలతో పాటు ఆయిల్ మార్కులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు వీటిని ఉతకడం కూడా కష్టమవుతుంది. కానీ ఇంట్లో ఉండే బేకింగ్ సోడా, వెనిగర్‌ను ఉపయోగించి ఈ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దిండుపై ఉండే ఆయిల్, మాయిశ్చర్,బ్యాక్టీరియా కూడా తొలగిపోతాయి.

Written ByRenuka Godugu
Published: Oct 17, 2026, 03:59 PM IST|Updated: Oct 17, 2026, 04:01 PM IST
joinshare
మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!
Image Credit: Yellow Pillow Stains Removal

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

2

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

3

మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!

4

Durga Ashtami: ఆదివారం దుర్గాష్టమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్ తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్.!.

5

Pulivendula: పులివెందులలో హైటెన్షన్.. ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు.. నామినేషన్లపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yellow Pillow Stains Removal: మన శరీరంలోని చర్మం నుండి వచ్చే నూనెలు, హెయిర్ ప్రొడక్ట్స్ ఇతర మలినాల వల్ల దిండుపై మచ్చలు పడతాయి. వీటిలోని ఫ్యాట్స్, ప్రోటీన్ల వల్ల పచ్చని మరకలు ఏర్పడటమే కాకుండా, దిండు నుండి దుర్వాసన కూడా వస్తుంది. వీటిని తొలగించడానికి బేకింగ్ సోడా, నీటిని సమాన పరిమాణంలో కలిపి ఒక మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. పచ్చని మరకలు ఎక్కువగా ఉన్న చోట ఈ పేస్ట్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దానిపై వైట్ వెనిగర్ స్ప్రే చేసి, ఉతికితే మచ్చలు పోతాయి.

మరో పద్ధతిలో, ఒక భాగం నిమ్మరసం, రెండు భాగాలు గోరువెచ్చని నీరు, వైట్ వెనిగర్ కలిపి మచ్చలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి; సూర్యరశ్మి సహజమైన బ్లీచ్‌లా పనిచేసి మరకలను పోగొడుతుంది.

ఇకపై ప్రతి వారం దిండును శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేయడం తప్పనిసరి. మచ్చలు, హెయిర్ ప్రొడక్ట్స్ దిండుపై పడకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ పిల్లో ప్రొటెక్టర్ ఉపయోగించండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లో కేస్‌లను రెండేళ్లకోసారి మారుస్తూ ఉండాలి. పిల్లో కేస్‌లను శుభ్రం చేసేటప్పుడు సాధారణ డిటర్జెంట్ల కంటే బేకింగ్ సోడా వంటి సహజమైన ఉత్పత్తులను వాడటం వల్ల అవి డీప్ క్లీన్ అవుతాయి.

Read Also: ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపట్లో తినాలి? ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తున్నారా? తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం!

 

Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

మనం ప్రతిరోజూ ఉపయోగించే దిండ్లు, బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి, తద్వారా మంచి నిద్ర లభిస్తుంది. బయట నుండి వస్తూ కూర్చుంటూ, పడుకుంటూ ఉండటం వల్ల వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు ఈ దిండ్లను అసలు ఉపయోగించకపోవడమే మంచిదని సూచించినప్పటికీ, చాలామందికి ఇవి అలవాటుగా ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యం బాగుండాలంటే పిల్లో కేసులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే, కాటన్ పిల్లో కేసులను ఉపయోగించడం వల్ల హెయిర్ కేర్‌కు మరింత మేలు జరుగుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Health