PRC కమీషనర్‌గా దినేష్ కుమార్..!!
PRC chairman: 12వేతన సవరణ కమిషన్ ( PRC)చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను నియామించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
PRC chairman Dinesh Kumar: 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ను నియమించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీత భత్యాలు, సేవా నిబంధనల సవరణ కోసం ఈ కమిషన్ ను ఉద్దేశించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సమావేశం జరిగినప్పుడు పీఆర్సీ చైర్మన్ ను నియమిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల వేతనాలను సమీక్షించి పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస, గరిష్ట వేతనాలను నిర్ణయించి ప్రభుత్వానికి పీఆర్సీ చైర్మన్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం జీతభత్యాలను నిర్ణయిస్తుంది.
దినేశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే:
1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2017 మార్చి 31 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రానికి సీఎస్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. తన సుదీర్ఘ కెరీర్ లో ఏపీతోపాటు కేంద్రంలోనూ అనేక కీలకమైన ఉన్నత పదవులు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథార్టీ చైర్మన్ గా 2014 ఆయన డిసెంబర్‌లో నియమితులయ్యారు. దీనికి ముందు.. దినేశ్ కుమార్ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
ఉమ్మడి ఏపీలోని.. అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా సమర్థవంతమైన క్షేత్రస్థాయి పరిపాలనను అందించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, తుఫానుల సమయంలో సహాయక చర్యలను పర్యవేక్షించే విపత్తు నిర్వహణ విభాగంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ నెయ్యి కల్తీ వివాదంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఆయనను చైర్మన్‌గా నియమించింది.