Andhra Pradesh: మహిళ ఖైదీ బిడ్డకు సెంట్రల్ జైల్లో బారసాల.. ఏపీలో వెల్లివిరిసిన మానవత్వం .!.
Woman inmate barala in Rajamahendravaram: మహిళకు జైలు అధికారులు భారసాల నిర్వహించారు. అంతే కాకుండా ప్రత్యేకంగా జైల్లో గదిని కూడా కేటాయించి బారసాల నిర్వహించారు.
Prison officials celebrate barasala in Rajamahendravaram jail: సమాజంలో ఇటీవల కొంత మందిలో నేర ప్రవృత్తి ఎక్కువైంది. కొంత మంది ప్రతి చిన్న విషయలు గొడవలు పడి పెద్దది చేసుకుంటున్నారు. వాగ్వాదాలు చేసుకుని, పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లి కేసుల్ని పెట్టుకుంటున్నారు. మహిళలు సైతం ఇటీవల నేరాల్లో పురుషుల్ని దాటేస్తున్నారు. ముఖ్యంగా భర్తలను చంపుతున్న ఘటనల్లో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఏపీలో ఒక మహిళ జైల్లో ఉండగా డెలీవరీ అయ్యింది. దీంతో జైలు అధికారులు ఆమెకు ప్రత్యేకంగా గదిని కేటాయించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్ర వరంలో ఒక మహిళ ఖైదీ బిడ్డకు జైలు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బారసాల నిర్వహించారు. సదరు మహిళ సెప్టెంబర్ 25న రిమాండ్ పై రాజమహేంద్ర వరం జైలుకు వచ్చింది. అప్పటికే ఆమె తొమ్మిదినెలల నిండు గర్భిణి. దీంతో ఆమెకు జైలులో ప్రత్యేకంగా గదిని కేటాయించారు. ఇటీవల రాజమహేంద్ర వరం జీజీహెచ్ ఆస్పత్రిలో మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
చిన్నారి ఆరోగ్యంగా 3.2 కేజీల బరువు ఉంది. దీంతో జైలు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళలకు మిషన్ శక్తి, అంగన్ వాడి, పోషణ్ 2.0 పథకాల ద్వారా పౌష్టికాహరం అందజేస్తున్నారు. అంతే కాకుండా రాజమహేంద్ర వరం జైల్లో మహిళల కూతురికి బారసాల కూడా నిర్వహించి అధికారులు గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ అధికారులు గొప్ప మనసుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.