Pune Devotee secretly wearing spy camera in srikalahasti: తిరుపతి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిశ్వర ఆలయం ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. శ్రీకాళ హస్తిశ్వర ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం వంటివి పూర్తిగా నిశేధం. అయితే.. ఇటీవల కొంత మంది సీక్రెట్ గా భద్రత సిబ్బంది కళ్లు కప్పి మరీ ఆలయంలో సీక్రెట్ స్పై కెమెరా లతో ప్రవేశిస్తున్నారు. గతంలో కూడా ఒక భక్తుడు శ్రీకాళహస్తిశ్వర ప్రధాన ఆలయంలో స్పై కెమెరాతో ఎంట్రీ ఇవ్వడంపై వివాదాం రాజుకుంది. దీనిపై భద్రత సిబ్బంది సీరియస్ అయ్యారు. తాజాగా.. మరోసారి శ్రీ కాళహస్తిశ్వర ఆలయంలో పూణెకు చెందిన భక్తుడు వచ్చి స్వామివారి అంతరాలయంలో స్పై కెమెరాతో రావడంను అర్చకులు గుర్తించారు. ఈ ఘటన తీవ్ర వివాదంగా మారింది.
శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం! స్పై కెమెరా ఉన్న కళ్లజోడుతో ఆలయంలోకి ప్రవేశించిన పూణెకు చెందిన అంకేశ్ అగర్వాల్. భ్రమరాంబిక అమ్మవారి ఆలయ పూజారి గుర్తించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది https://t.co/2qOWla9LDH
— greatandhra (@greatandhranews) November 14, 2026
మహారాష్ట్రలోని పూణెకు చెందిన అంకేష్ అగర్వాల్ అనే భక్తుడు తనకుటుంబంతో కలిసి శ్రీకాళహస్తిశ్వర ఆలయంకు తన కుటుంబంతో కలిసి వచ్చాడు. మొదట ఆయన ఆలయంలో రూ. 5,000 రుసుము చెల్లించి రాహు-కేతు నివారణ పూజలు చేయించుకున్నారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల ఆలయంకు వెళ్లి పూజలు చేశారరు. ఇంతలో అమ్మవారిని ఆ భక్తుడు దర్శించుకుంటుండగా కళ్లకు స్పై కెమెరా ఉండటంను అర్చకులు గుర్తించారు.
వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది వెంటనే సదరు భక్తుడికి అదుపులోకి తీసుకున్నారు. స్పై కెమెరా, వీడియోలు,ఫోన్ లపై నిషేధం ఉండగా కూడా ఏవిధంగా ఆలయంలోకి ప్రవేశించాడో ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయంలోసున్నితమైన దృశ్యాలను తీశారో, గర్భగుడి ప్రధాన విగ్రహాల్నిఫోటోలు లేదా వీడియోలు తీశారా..?. అన్న కోణంలో భద్రత సిబ్బంది విచారణ చేపట్టారు.ఈ ఘటనతో శ్రీ కాళహస్తిలో గందర గోళం తలెత్తింది. ఇప్పటికే శ్రీకాళహస్తిశ్వరాలయంలో కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు.